నవంబర్ 23న తులా రాశిలో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం, ఐదు రాశుల వారి జీవితంలో వెలుగులు.. బాధలు, కష్టాలకు చెక్!

రాక్షసులకు గురువు, ప్రేమకు, సంపదకు కారకుడు అయినటువంటి శుక్రుడు, సొంత రాశి అయినటువంటి తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు నవంబర్ 23, ఆదివారం సాయంత్రం 7:58కి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో బుధ, శుక్ర కలయిక ఏర్పడుతుంది. ఇది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని తీసుకొస్తుంది.

Published on: Nov 19, 2025 4:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభయోగాల్లో శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. నవంబర్ 23న తులా రాశితో శుక్రుడు, బుధుడు సంయోగం చెంది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఈ శుభయోగం కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

లక్ష్మీనారాయణ రాజయోగంతో, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు (pinterest)
లక్ష్మీనారాయణ రాజయోగంతో, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు (pinterest)

లక్ష్మీనారాయణ యోగం

రాక్షసులకు గురువు, ప్రేమకు, సంపదకు కారకుడు అయినటువంటి శుక్రుడు, సొంత రాశి అయినటువంటి తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు నవంబర్ 23, ఆదివారం సాయంత్రం 7:58కి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో బుధ, శుక్ర కలయిక ఏర్పడుతుంది. ఇది లక్ష్మీనారాయణ రాజయోగాన్ని తీసుకొస్తుంది.

ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? లక్ష్మీనారాయణ యోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.

లక్ష్మీనారాయణ రాజయోగంతో, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రమోషన్ రావచ్చు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3.తులా రాశి

తులా రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఎంతో కలిసివస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశాలు ఉన్నాయి.

4.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ యోగం బాగా కలిసొస్తుంది. శుక్రుడు, బుధ సంయోగం ఆర్థికపరంగా విజయాలను అందిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

5.మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం సానుకూల మార్పులు తీసుకొస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు అనుకున్నవి పూర్తవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More