Gemini Yearly Horoscope: 2026లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? కెరీర్, ఆరోగ్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!

2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? 2026లో మిథున రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కమ్యూనికేషన్, మీడియా, విద్య, ఐటీ రంగాల వారు సక్సెస్‌ను అందుకుంటారు. కష్టపడితే కచ్చితంగా విజయాలను అందుకుంటారు. 

Published on: Nov 12, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారికి వ్యాపారం ఎలా సాగుతుంది? ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2026 మిథున రాశి వార్షిక ఫలితాలు (pinterest)
2026 మిథున రాశి వార్షిక ఫలితాలు (pinterest)

2026 మిథున రాశి వార్షిక ఫలితాలు:

2026లో మిథున రాశి వారు కెరీర్‌లో, వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు. యోగా, మెడిటేషన్ చేయడం మంచిది.

2026లో మిథున రాశి వారి వ్యాపారం ఎలా ఉంటుంది?

2026లో మిథున రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కమ్యూనికేషన్, మీడియా, విద్య, ఐటీ రంగాల వారు సక్సెస్‌ను అందుకుంటారు. కష్టపడితే కచ్చితంగా విజయాలను అందుకుంటారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కష్టానికి తగ్గ ఫలితాలు కనిపిస్తాయి. జూన్ తర్వాత కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి. సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో భవిష్యత్తు బాగుంటుంది.

2026 మిథున రాశి వారి ఆర్థిక ఫలితాలు:

ఆర్థికపరంగా చూస్తే 2026 నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. జూన్ నాటికి బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న డబ్బులు మీ వద్దకు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు కాస్త ఎక్కువ అవుతాయి, కానీ కొంచెం సేవింగ్స్ చేసుకుంటే మంచిది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆస్తులు కొనుగోలు చేయడానికి శుభ సమయం.

2026 మిథున రాశి వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?

2026లో మిథున రాశి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల నుంచి విజయాలు చూస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపడానికి సమయం ఉంటుంది. పాత రిలేషన్‌షిప్స్ కూడా తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త విజయాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పిల్లలు కలగాలని కోరుకునేవారు ఈ ఏడాది మధ్యలో శుభవార్త వింటారు.

2026లో మిథున రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?

2026లో మిథున రాశి వారు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న వారి జీవితంలో ప్రత్యేక వ్యక్తి రావచ్చు. ప్రేమికులు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

2026లో ఆరోగ్యం ఎలా ఉంటుంది:

2026లో మిథున రాశి వారి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ కొంచెం మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఉండొచ్చు. జీర్ణ సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. యోగా, మెడిటేషన్ వంటి వాటిని పాటించండి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

విద్య, ఉద్యోగాలు:

2026లో ఈ రాశి వారి విద్య, ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జూన్, డిసెంబర్‌లో మరింత ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. టెక్నికల్, లాంగ్వేజ్ వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి.

ప్రయాణాలు:

2026లో ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ ట్రిప్స్ కూడా వేస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఫ్యామిలీ ట్రిప్స్, తీర్ధ యాత్రలకు ప్రశాంతంగా వెళ్లి వస్తారు.

పరిహారాలు:

బుధుడి అనుగ్రహం కలగడానికి మిథున రాశి వారు ఏడాది పొడవునా విష్ణువుని ఆరాధించడం మంచిది. బుధవారం నాడు ఆకుపచ్చని దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. “సద్ బుధాయ నమః” అనే మంత్రాన్ని పఠించండి.

News/Rasi Phalalu/Gemini Yearly Horoscope: 2026లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? కెరీర్, ఆరోగ్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!
News/Rasi Phalalu/Gemini Yearly Horoscope: 2026లో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? కెరీర్, ఆరోగ్యంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!