రాహువు శక్తి రెట్టింపు, డిసెంబర్ 3 నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. డబ్బు, ప్రొమోషన్లతో పాటు అనేక లాభాలు!
రాహువు మంచి స్థానంలో ఉన్నట్లయితే, ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారు రాహువు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ, సంతోషంగా కూడా ఉంటారు. డిసెంబర్ 3 నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో తెలుసుకోండి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు సహజంగా ఏర్పడటం చూస్తూ ఉంటాం. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. రాహువుని చెడు గ్రహం అని అంటారు. రాహువు మంచి స్థానంలో ఉన్నట్లయితే, ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారు రాహువు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ, సంతోషంగా కూడా ఉంటారు.

రాహువు సంచారం
రాహువు డిసెంబర్ 2 మంగళవారం తెల్లవారుజామున 2:15కు శతభిష నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే, పూర్వభద్ర మొదటి పాదంలో రాహువు సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. రాహువు శతభిష నక్షత్రం నాలుగో పాదంలోకి వచ్చినప్పుడు, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ప్రమోషన్లు రావచ్చు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఉద్యోగుల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు లాభాన్ని చూస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో తెలుసుకోండి.
డిసెంబర్ 3 నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. రాహువు శక్తి రెట్టింపుతో అనేక లాభాలు
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి బాగుంటుంది. రాహువు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. శతభిష నక్షత్రం నాలుగో పాదంలోకి రాహువు ప్రవేశించడంతో కొన్ని శుభ ఫలితాలను చూస్తారు. అదృష్టం కూడా పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు రావచ్చు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి రాహువు అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతున్నాడు. అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారులకీ బాగుంటుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగుల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.
3.మకర రాశి:
మకర రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఎక్కువ మార్పులను చూస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి. పాత స్నేహితులు మళ్లీ కలుసుకుంటారు. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


