మరో 15 రోజుల్లో ఈ రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. రాహువు అనుగ్రహంతో డబ్బు, ప్రమోషన్లు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

గ్రహాల సంచారం, గ్రహాల కలయిక జరుగుతూ ఉంటాయి. త్వరలోనే రాహువు సంచారంలో మార్పు చేయనుంది. చాలా నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు ఒకటి. నవంబర్ 23న చూసుకున్నట్లయితే రాహువు నక్షత్ర సంచారం జరగనుంది. ఇలా రాహువు నక్షత్రాన్ని మార్చడంతో కొన్ని రాశుల వారిపై రాహువు అనుగ్రహం కలిగి, సకల సంతోషాలు కలుగుతాయి.

Published on: Nov 8, 2025, 12:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు సహజంగా ఏర్పడతాయి. రాశులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ప్రభావాన్ని చూపిస్తాడు రాహువు. శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలను, అశుభ స్థానంలో ఉంటే సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరో 15 రోజుల్లో రాహువు నక్షత్ర సంచారం (pinterest)
మరో 15 రోజుల్లో రాహువు నక్షత్ర సంచారం (pinterest)

రాహువుకి ఉండే ప్రత్యేకత, ప్రాముఖ్యత ఎంతో ఉంది. రాహువు మంచి స్థానంలో ఉంటే మాత్రం ఆ రాశి వారికి ఇక పండగే. అదే నీచ స్థానంలో ఉంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మరో 15 రోజుల్లో రాహువు సంచారంలో మార్పు చోటు చేసుకోబోతోంది.

రాహువు సంచారం

గ్రహాల సంచారం, గ్రహాల కలయిక సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. త్వరలోనే రాహువు సంచారంలో మార్పు చేయనుంది. చాలా నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు ఒకటి. నవంబర్ 23న చూసుకున్నట్లయితే రాహువు నక్షత్ర సంచారం జరగనుంది. ఇలా రాహువు నక్షత్రాన్ని మార్చడంతో కొన్ని రాశుల వారిపై రాహువు అనుగ్రహం కలిగి, సకల సంతోషాలు కలుగుతాయి.

ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా మార్పులను చూస్తారు, కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఏ రాశుల వారికి రాహువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోందో, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మరో 15 రోజుల్లో రాహువు నక్షత్ర సంచారంతో ఈ రాశుల వారికి లాభాలు:

1.మిథున రాశి:

మిథున రాశి వారికి రాహువు నవంబర్ 23న శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం ఆనందంగా సాగుతుంది.

2.కన్య రాశి

కన్య రాశి వారికి రాహువు సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈ రాశి వారు అనుకున్న పనులను కూడా సక్రమంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కూడా పెరుగుతుంది. ప్రతి పనిలో విజయాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితంతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇలా ఈ రాశి వారు కూడా రాహువు సంచారంతో అనేక రకాల మార్పులను చూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More