డిసెంబర్ నెలలో 4 సార్లు శుక్రుని సంచారంలో మార్పు, ఐదు రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు.. డబ్బు, ఆనందం ఇలా ఎన్నో!

డిసెంబర్ 2025లో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు. శుక్రుడు సంపద, డబ్బు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్ర సంచారం కొన్ని రాశుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. మరి ఏ రాశులకు శుక్ర సంచారం బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.

Published on: Nov 17, 2025 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. మరి కొన్ని రోజుల్లో నవంబర్ నెల పూర్తి కాబోతోంది, డిసెంబర్ రాబోతోంది. ఈ డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉండనుంది.

డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు.
డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు.

ముఖ్యంగా శుక్రుని సంచారం ఆసక్తికరంగా మారబోతోంది. డిసెంబర్ 2025లో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు. శుక్రుడు సంపద, డబ్బు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్ర సంచారం కొన్ని రాశుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుని సంచారంలో మార్పు:

డిసెంబర్ 9న శుక్రుడు అనూరాధ నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 19న శుక్రుడు దక్షిణం వైపు కదులుతాడు. డిసెంబర్ 20న శుక్రుడు వృశ్చిక రాశి నుంచి తులా రాశి ద్వారా ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 30న శుక్రుడు మూల నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా నాలుగు సార్లు శుక్రుని సంచారంలో మార్పు కొన్ని రాశుల వారికి అద్భుతాలను తీసుకురాబోతోంది.

డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు.. ఈ రాశులకు లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి డిసెంబర్ నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్ట్స్, మ్యూజిక్‌పై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.

2.వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ–మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా బాగా ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి శుక్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.

4.తులా రాశి

తులా రాశి వారికి శుక్రుని సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది.

5.మీన రాశి

మీన రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More