అఖండ 2 ఫస్ట్ రివ్యూ.. పైసా వసూల్ మూవీ, సిటీ మార్ క్లైమాక్స్.. బాలకృష్ణ-బోయపాటి సినిమాకు రేటింగ్ ఎంతంటే?

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన అఖండ 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో సెన్సార్ స్క్రీనింగ్‌లో సినిమా చూసిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు అఖండ 2పై రివ్యూ ఇచ్చారు.

Published on: Dec 4, 2025, 14:05:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నట సింహం నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో బాలయ్య-బోయపాటిలది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్‌ అని తెలిసిందే. సింహా నుంచి మొదలుపెడితే వీరి కాంబోలో లెజెండ్, అఖండ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ వచ్చాయి.

అఖండ 2 ఫస్ట్ రివ్యూ.. పైసా వసూల్ మూవీ, సిటీ మార్ క్లైమాక్స్.. బాలకృష్ణ-బోయపాటి సినిమాకు రేటింగ్ ఎంతంటే?
అఖండ 2 ఫస్ట్ రివ్యూ.. పైసా వసూల్ మూవీ, సిటీ మార్ క్లైమాక్స్.. బాలకృష్ణ-బోయపాటి సినిమాకు రేటింగ్ ఎంతంటే?

బోయపాటికి నంది అవార్డ్

అంతేకాకుండా లెజెండ్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా బోయపాటి శ్రీను నంది అవార్డ్ కూడా అందుకున్నారు. అఖండ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో అది కూడా అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా అఖండ 2 తాండవం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంగీతం అండ్ ఫైట్ మాస్టర్స్

పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 సినిమాను రూపొందించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించగా బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పకులుగా ఉన్నారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

సరికొత్త అవతారంలో ఆది పినిశెట్టి

అంతేకాకుండా అఖండ 2 సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ నటిస్తే.. విలన్‌గా హీరో ఆది పినిశెట్టి సరికొత్త అవతారంలో అలరించనున్నాడు. హీరోయిన్ పూర్ణది మరో కీలకమైన పాత్ర. ఇలా అన్ని విధాలుగా హైప్ పెంచేస్తోన్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అఖండ 2 రివ్యూ

ఈ నేపథ్యంలో అఖండ 2 రివ్యూపై అందరికి క్యూరియాసిటీ నెలకొంది. అయితే, అఖండ 2 సినిమాను సెన్సార్ కోసం దుబాయ్‌లో స్క్రీనింగ్ చేశారు. సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా అఖండ 2 వీక్షించినట్లు తెలిపారు. అంతేకాకుండా అఖండ 2 తాండవంపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

ఉమైర్ సంధు రివ్యూ

ఈ విషయాన్ని చెబుతూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు ఉమైర్ సంధు. "అఖండ 2 ఫస్ట్ రివ్యూ. బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఇది పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ. ఇందులో యాక్షన్, భారీ డైలాగ్స్, విజిల్స్ వేయించే క్లైమాక్స్ ఉంది. కాకపోతే ఇది కేవలం మాస్ ఆడియెన్స్ కోసం మాత్రమే" అని ఉమైర్ సంధు అఖండ 2పై రివ్యూ రాసుకొచ్చారు.

అఖండ 2 రేటింగ్

రివ్యూతో పాటు అఖండ 2 సినిమాకు ఐదుకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. దీంతో ఉమైర్ సంధు అఖండ2 రివ్యూ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More