సినిమాను భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే.. మూవీకి ఆక్సిజన్ లాంటి వాళ్లు.. నిర్మాత గోపి ఆచంట కామెంట్స్
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత గోపి ఆచంట ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో నాలుగోసారి వస్తున్న లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మాతలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.
సినిమాను భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే.. మూవీకి ఆక్సిజన్ లాంటి వాళ్లు.. నిర్మాత గోపి ఆచంట కామెంట్స్
అఖండ 2 నిర్మాత గోపి ఆచంట కామెంట్స్
ఎస్ తమన్ సంగీతం అందించిన అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గోపి ఆచంట ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆక్సిజన్ లాంటి వాళ్లు అభిమానులు
నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. "జై బాలయ్య. నందమూరి అభిమానులందరికీ స్వాగతం. ఒక సినిమాని భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే. సినిమాకి ఆక్సిజన్ లాంటివాళ్లు అభిమానులు. మీ అందరికీ మా నిర్మాతల తరఫున సినిమా ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు" అని అన్నారు.
ఇద్దరు తాండవం
"మా సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌కి టెక్నీషియన్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు. కెమెరా ముందు మా బాలయ్య బాబు గారి తాండవం. కెమెరా వెనకాల డైరెక్టర్ బోయపాటి గారి తాండవం, డిసెంబర్ 5న థియేటర్‌లో ప్రేక్షకులు తాండవం.. ఇది పక్కా" అని చెప్పారు ప్రొడ్యూసర్ గోపి ఆచంట.
ఇది డబుల్ బ్లాక్ బస్టర్
"ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. దానికి మించి ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డిసెంబర్ 5న దేశం మొత్తం బాలయ్య బాబు గారి నట విశ్వరూపం చూస్తుంది" అని అఖండ 2 నిర్మాత గోపి ఆచంట తెలిపారు.
చేయి పట్టి నడిపించింది
లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. "ఈ జనసందోహాన్ని చూస్తుంటే ఒక మహా శివరాత్రిని చూస్తున్నట్టుగా ఉంది. నా జీవితంలో మలుపు, మైలురాయి అఖండ సినిమానే. నా చేయి పట్టి నన్ను నడిపించింది మా గురువుగారు బోయపాటి శ్రీను గారు" అని అన్నారు.
మనందరి దైవం ఆయన
"మనందరి దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయనే తెలుగు జాతి ఆత్మ, ఆత్మ గౌరవంగా మన బాలయ్య బాబు గారు వచ్చారు. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలు తీయడం మా గురువుగారు బోయపాటి శ్రీను గారి వలన అవుతుంది. అది ఎన్నోసార్లు మనం చూసాం, మరోసారి చూడబోతున్నాం" అని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.
అఖండాన్ని అర్థం చేసుకుంది తమన్
"అఖండాన్ని అర్థం చేసుకున్న సంగీత దర్శకుడు తమన్ గారు. మా మా అందరిని ఒక చోటకు చేర్చి ఈ అద్భుతమైన పాటలు చేయించారు. ఈ అవకాశం ఇచ్చిన ఆ పరమశివుడు.. శివుడికి జన్మతః రుణపడి ఉంటాం" అని రచయిత కల్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.
News/Entertainment/సినిమాను భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే.. మూవీకి ఆక్సిజన్ లాంటి వాళ్లు.. నిర్మాత గోపి ఆచంట కామెంట్స్
News/Entertainment/సినిమాను భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే.. మూవీకి ఆక్సిజన్ లాంటి వాళ్లు.. నిర్మాత గోపి ఆచంట కామెంట్స్