నాకు పెళ్లై రెండేళ్లు అవుతుంది, కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు.. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు కామెంట్స్

దృష్టి, వివాహ భోజనంబు, సామజవరగమన సినిమాలతో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ఇటీవల తిరువీర్ నటించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు రామ్ అబ్బరాజు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ అబ్బరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 30, 2025, 14:43:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో దృష్టి, వివాహ భోజనంబు సినిమాలతో మోస్తరుగా.. సామజవరగమన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు. అయితే, యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.

నాకు పెళ్లై రెండేళ్లు అవుతుంది, కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు.. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు కామెంట్స్
నాకు పెళ్లై రెండేళ్లు అవుతుంది, కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు.. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు కామెంట్స్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు రామ్ అబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు టాలీవుడ్ డైరెక్టర్స్ కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ కూడా గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా రామ్ అబ్బరాజు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

బాగా కనెక్ట్ అయ్యాను

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. కానీ, ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

సిచ్యువేషనల్ కామెడీతో

"సిచ్యువేషనల్ కామెడీతో రానున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. తిరువీర్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్" అని డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెలిపారు.

రోహన్ బిజీగా మారిపోయాడు

ఇదే ఈవెంట్‌లో దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. "తిరువీర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రోహన్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. నాకు సురేష్ బొబ్బిలి మంచి స్నేహితుడు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలి. సురేష్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని అనుకుంటున్నాను" అని అన్నారు.

ఆయనకు పెద్ద అభిమానిని

"తిరువీర్ గారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. త్వరలో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను" అని ఆదిత్య హాసన్ చెప్పారు.

టీనాకు మళ్లీ సక్సెస్ రావాలి

"తిరువీర్ గారు చేసిన ‘పరేషాన్’ అంటే నాకు చాలా ఇష్టం. మా ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి వచ్చిన టీనా శ్రావ్యకు మళ్లీ సక్సెస్ రావాలి. రోహన్‌లో ఎంతో పాజిటివిటీ, ఎనర్జీ ఉంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త వాళ్లను సపోర్ట్ చేసేందుకు మేం ఎప్పుడూ ముందుంటాం. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది" అని డైరెక్టర్ యదు వంశీ పేర్కొన్నారు.

ఫస్ట్ ఛాయిస్‌గా తిరువీర్

"‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఎవరైనా ఏదైనా కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తుంటే.. వారికి ఫస్ట్ ఛాయిస్‌గా తిరువీర్ నిలుస్తున్నారు. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. నవంబర్ 7న ఈ సినిమాను అందరూ చూడండి" అని అంబాజీపేట డైరెక్టర్ దుశ్యంత్ వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More