బాలకృష్ణ అఖండ 2 ఎఫెక్ట్- ఓటీటీలో ఇవాళ రిలీజ్ కావాల్సిన తెలుగు బోల్డ్ రొమాంటిక్ సిరీస్ వాయిదా- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2 ఎఫెక్ట్ ఓటీటీ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2పై పడింది. దాంతో ఇవాళ ఓటీటీ రిలీజ్ కావాల్సిన ఈ బోల్డ్ రొమాంటిక్ సిరీస్ వాయిదా పడింది. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు నటించిన 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.
పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ ఎఫెక్ట్ చిన్న మూవీస్‌పై పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి అన్నింటికి భిన్నంగా అగ్ర కథనాయకుడి సినిమా విడుదల ప్రభావం ఓటీటీ వెబ్ సిరీస్‌పై పడింది. దీంతో ఆ సిరీస్ ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.

అఖండ సీక్వెల్‌గా
ఆ సినిమా అఖండ 2 అయితే, వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా, అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే అఖండ 2 తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సింది.
ఫైనాన్స్ క్లాష్ వల్ల
కానీ, నిర్మాణ సంస్థ 14 రీల్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య ఫైనాన్స్ క్లాష్ వల్ల వారం ఆలస్యంగా అంటే ఇవాళ (డిసెంబర్ 12) థియేటర్లలోకి అడుగుపెడుతుంది అఖండ 2. దీంతో ఇవాళ థియేటర్లలో విడుదల కావాల్సిన మోగ్లీ, ఈషా, సైక్ సిద్దార్థ్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.
మరో రోజుకు వాయిదా
ఓ పెద్ద హీరో మూవీ రిలీజ్ అవుతుంటే చిన్న హీరోల సినిమాలు వాయిదా పడటం కామనే. అలాగే ఈసారి జరిగింది. కానీ, బాలకృష్ణ అఖండ 2 విడుదల అవుతున్న నేపథ్యంలో ఓటీటీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 కూడా పోస్ట్‌పోన్ అయింది. అఖండ 2 ఎఫెక్ట్‌తో ఇవాళ (డిసెంబర్ 12) ఓటీటీ రిలీజ్ కావాల్సిన 3 రోజెస్ సీజన్ 2 మరో రోజుకు వాయిదా పడింది.
త్రీ రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్
ఓ హీరో సినిమాతో ఓటీటీ సిరీస్ వాయిదా పడటం ఇదే తొలిసారి. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే త్రీ రోజెస్ సీజన్ 2 రేపటికి వాయిదా పడింది. అంటే, డిసెంబర్ 13 నుంచి 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఒక్కరోజు ఆలస్యంగా ఆహాలో త్రీ రోజెస్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత ఎస్ఎక్ఎన్ వెల్లడించారు.
ముగ్గురు బ్యూటిఫుల్ భామలు
అలాగే, దీనికి సంబంధించి త్రీ రోజెస్ సీజన్ 2 ట్రైలర్ కూడా విడుదల చేసింది ఆహ సంస్థ. ఇక త్రీ రోజెస్ సీజన్ 2లో బ్యూటిఫుల్ భామలు ఈషా రెబ్బా, రాశి సింగ్, కుశిత కల్లపు ముగ్గురు హీరోయిన్స్‌గా నటించారు. వీరితోపాటు వైవా హర్ష, సత్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
బోల్డ్, రొమాంటిక్ సీన్లతో
త్రీ రోజెస్ సీజన్ 2కి షో రన్నర్‌గా ప్రభాస్ ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ఉంటే కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. కాగా, ఇది ఒక ముగ్గురు స్నేహితుల కథ. పెళ్లిళ్లు, రొమాన్స్, బోల్డ్, కామెడీ వంటి సీన్లతో త్రీ రోజెస్ సీజన్ 2 సాగినట్లు ట్రైలర్, టీజర్ ద్వారా తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


