తెలుగులో అరుదుగా వచ్చే ఓటీటీ సిరీస్ ఇది.. హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కామెంట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయనం. బిగ్ బాస్ బ్యూటి ప్రియాంక జైన్ హీరోయిన్‌గా నటించిన ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఇటీవల జరిగిన నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షెరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Dec 11, 2025, 09:55:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మ‌రోసారి త‌న‌దైన శైలిలో విల‌క్ష‌ణ‌మైన తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది. అదే ‘న‌య‌నం’. హీరో వ‌రుణ్ సందేశ్‌, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.

తెలుగులో అరుదుగా వచ్చే ఓటీటీ సిరీస్ ఇది.. హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కామెంట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో అరుదుగా వచ్చే ఓటీటీ సిరీస్ ఇది.. హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కామెంట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్

నయనం ఓటీటీ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. సీట్ ఎడ్జ్ సైకో, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నయనం సిరీస్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో ఇటీవల నయనం ట్రైలర్ రిలీజ్ లాంచ్ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ స్వాతి ప్ర‌కాష్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌, ఎడిట‌ర్ వెంక‌ట కృష్ణ‌, సినిమాటోగ్రాఫ‌ర్ షోయ‌బ్ సిద్ధికీ, అలీ రెజా, డైరెక్ట‌ర్ రాజేష్‌, డైరెక్ట‌ర్ శేఖ‌ర్‌, జీ5 తెలుగు సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ జ‌యంత్ రాఘ‌వ‌న్‌, ర‌జ‌నీ తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ విద్యాసాగ‌ర్‌ పాల్గొన్నారు.

వితికా షెరు కామెంట్స్

వీరితోపాటు జీ5 ఓటీటీ తెలుగు ఒరిజిన‌ల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ‌, జీ5 చీఫ్ కంటెంట్ ఆఫీస‌ర్‌, బిజినెస్ హెడ్ అనూరాధ, హీరోయిన్ ప్రియాంక జైన్‌, హీరో వ‌రుణ్ సందేశ్‌, వితికా శేరు త‌దిత‌రులు నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షెరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వితికా షెరు మాట్లాడుతూ.. "జీ5 ఓటీటీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కంటెంట్‌తో మెప్పిస్తుంటారు. ఇంత మంచి కంటెంట్ ఇస్తోన్న జీ5కు థాంక్స్‌. ఓ లేడీ డైరెక్ట‌ర్ దీన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని తెలియ‌గానే వావ్ అనిపించింది. ట్రైల‌ర్ చూడ‌గానే సూప‌ర్బ్‌గా అనిపించింది" అని అన్నారు.

చాలా హార్డ్ వర్కర్

"తెలుగులో అరుదుగా వ‌చ్చే ప్రాజెక్ట్ (నయనం ఓటీటీ సిరీస్) ఇది. అజ‌య్ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్, షోయబ్‌గారి విజువ‌ల్స్ బ్యూటిఫుల్. ప్రియాంక క్యారెక్ట‌ర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారు. అలీ రెజా చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. యాక్టింగ్ అంటే ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి" అని వితికా షెరు తెలిపారు.

"వ‌రుణ్ సందేశ్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందోన‌ని ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. త‌న లుక్ కూడా బావుంది. త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించే సిరీస్ అవుతుంది" అని వరుణ్ సందేశ్ భార్య, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వితికా షెరు పేర్కొన్నారు.

నయనం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ మాట్లాడుతూ.. ‘‘నయనం ఫస్ట్ టైమ్ నాకు స్వాతి గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఇప్పుడదే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో మ్యూజిక్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అని అన్నారు.

ఇదిలా ఉంటే, జీ5 ఒరిజిన‌ల్‌ సిరీస్‌గా నయనం తెరకెక్కింది. సైకలాజికల్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నయనం చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కాగా డిసెంబర్ 19 నుంచి జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More