ప్రభాస్‌కు చెల్లెలుగా నటించా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గెస్టుగా వచ్చారు.. హీరోయిన్ ఉష శ్రీ కామెంట్స్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఉష శ్రీ హీరోయిన్‌గా చేస్తున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఈ సినిమాలో హీరోగా సాయి చరణ్ చేశాడు. మణికంఠ దర్శకత్వం వహించిన ఇట్స్ ఓకే గురు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 6న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ ఉష శ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ఇట్స్ ఓకే గురు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించిన ఉష శ్రీ ఇట్స్ ఓకే గురు మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సాయి చరణ్ హీరోగా చేశాడు. క్రాంతి ప్రసాద్ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా మణికంఠ దర్శకత్వం వహించారు.

ఇట్స్ ఓకే గురు రిలీజ్ డేట్
ఇప్పటికే రిలీజ్ అయిన ఇట్స్ ఓకే గురు మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 6న ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.
అతిథిగా మెహర్ రమేష్
ఈ ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా వచ్చారు. ప్రభాస్ స్టైలిష్ ఫిల్మ్ బిల్లా సినిమాలో డార్లింగ్‌కు చెల్లెలుగా నటించిన హీరోయిన్ ఉష శ్రీ. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది హీరోయిన్ ఉష శ్రీ.
ప్రభాస్ చెల్లెలుగా నటించా
హీరోయిన్ ఉష శ్రీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మెహర్ రమేష్ గారి సినిమాలో ప్రభాస్ గారికి సిస్టర్‌గా చేశాను. నాకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఈరోజు నేను మెయిన్ లీడ్‌గా చేస్తున్న సినిమాకి గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి థాంక్యూ" అని తెలిపింది.
నాకు చాలా స్పెషల్
"ఈ సినిమా నాకు చాలా స్పెషల్. హీరోయిన్‌గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది మా టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని హీరోయిన్ ఉష శ్రీ ఆశాభావం వ్యక్తం చేసింది.
60 శాతం హిట్ అయినట్లే
ఇదే ఈవెంట్‌లో నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "'ఇట్స్ ఓకే గురు' టైటిల్ చాలా బాగుంది. అందరికీ రీచ్ అయింది. కంటెంట్ చూస్తుంటే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. లవ్ స్టోరీకి మ్యూజిక్ విజువల్స్ బాగుంటే 60% సినిమా హిట్ అయినట్టే" అని జోస్యం చెప్పారు.
జయసుధ లాగా అనిపించింది
"సినిమాని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హీరో చరణ్ హీరో ఈజ్ బాగుంది. హీరోయిన్ జయసుధ గారు లాగా అనిపించారు. ఈ ఇద్దరికీ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్" అని దామోదర్ ప్రసాద్ చెప్పారు.
ఐదో సినిమా
మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ.. "ఇది నా ఐదో సినిమా ఇందులో అన్ని పాటలు చేశాను. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది" అని తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


