ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ప్రభాస్ స్టైలిష్ పోస్టర్‌తో అనౌన్స్ చేసిన మేకర్స్
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. శుక్రవారం (నవంబర్ 21) రెబల్ స్టార్ స్టైలిష్ పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండగలాంటి న్యూస్. అతని నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్ నుంచి ఓ కీలకమైన అప్డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ అనౌన్స్‌మెంట్ ను మేకర్స్ శుక్రవారం (నవంబర్ 21) ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చేశారు.

ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ల వేగం పెంచారు. రెబల్ సాబ్ పేరుతో ఫస్ట్ సింగిల్ తీసుకురానున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను ఆదివారం (నవంబర్ 23) రిలీజ్ చేయనున్నారు.
శుక్రవారం (నవంబర్ 21) ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. "ద మ్యాన్ ఆఫ్ స్వాగ్" అనే వైబ్‌ని క్రియేట్ చేశాడు. “స్టైల్ స్వాగ్ ఎంట్రీ లెవెల్.. రెబల్ సాబ్ మన డార్లింగ్ లోని పీక్ చూపించబోతోంది. ఈ నవంబర్ 23ను పండగ రోజుగా మార్చనుంది” అనే క్యాప్షన్ తో మేకర్స్ ట్వీట్ చేశారు.
ది రాజా సాబ్ మూవీ గురించి..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టి.జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్ జానర్లో రాబోతోంది. ప్రభాస్ ఇప్పటివరకు చేయని డిఫరెంట్ జానర్ ఇది.
ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ "రెబల్ సాబ్" ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
దర్శకుడు మారుతి ఈ సినిమాని కేవలం హారర్ ఎలిమెంట్స్‌తోనే కాకుండా, ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దుతున్నాడు. మొత్తానికి “రెబల్ సాబ్”తో ఇక నుంచి రాజా సాబ్ మానియా మొదలైనట్లే కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


