దళపతి విజయ్ జన నాయగన్ ట్రైలర్‌లో జెమినీ ఏఐ లోగో- 400 కోట్ల మూవీలో సిల్లీ మిస్టేక్, రీమేక్‌కు కూడా అవసరమా, అవమానం అంటూ!

దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ ట్రైలర్‌లో జెమినీ ఏఐ వాటర్‌మార్క్ కనిపించడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. రూ. 400 కోట్ల బడ్జెట్ సినిమాలో ఈ సిల్లీ మిస్టేక్ ఏంటీ అంటూ నెటిజన్లు ఎకిరీ పారేస్తున్నారు. ఇలా ఏఐ వాడటం పెద్ద అవమానం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jan 4, 2026, 09:12:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి జన నాయగన్ ట్రైలర్‌ను శనివారం (జనవరి 3) విడుదల చేశారు మేకర్స్.

దళపతి విజయ్ జన నాయగన్ ట్రైలర్‌లో జెమినీ ఏఐ లోగో- 400 కోట్ల మూవీలో సిల్లీ మిస్టేక్, రీమేక్‌కు కూడా అవసరమా, అవమానం అంటూ!
దళపతి విజయ్ జన నాయగన్ ట్రైలర్‌లో జెమినీ ఏఐ లోగో- 400 కోట్ల మూవీలో సిల్లీ మిస్టేక్, రీమేక్‌కు కూడా అవసరమా, అవమానం అంటూ!

శనివారం విడుదలైన జన నాయగన్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న ‘ఏఐ’ (AI) పొరపాటు దొర్లడం ఇప్పుడు చిత్ర యూనిట్‌ను ఇరకాటంలో పడేసింది.

ఏం జరిగిందంటే?

జన నాయగన్ ట్రైలర్ ఆరంభంలో ఒక వ్యక్తి షాట్‌గన్‌ను లోడ్ చేస్తున్న సీన్ వస్తుంది. సరిగ్గా ఆ సీన్ తర్వాత వచ్చే కొన్ని క్షణాల విజువల్‌లో గూగుల్‌‌కు చెందిన ఏఐ టూల్ ‘జెమిని’ (Gemini) లోగో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జెమినీ ఏఐ వాటర్‌మార్క్‌ను తొలగించడం కూడా ఎడిటర్ మర్చిపోయారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ట్విట్టర్ (X) లో దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌లు వైరల్ కావడంతో జన నాయగన్ మూవీ టీం అప్రమత్తమైంది. ఆదివారం (జనవరి 4) ఉదయం నాటికి జన నాయగన్ ట్రైలర్ నుంచి ఆ లోగో ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వందల కోట్ల బడ్జెట్.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

"సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాలో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో ఏఐ వాడటం కళాత్మకతను అవమానించడమేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఒక రీమేక్ సినిమాకు కూడా ఏఐ వాడాలా?" అని మరొకరు సెటైర్లు వేయగా, "ఇది విజయ్ గారి ఆఖరి సినిమా.. కనీసం ఎడిటింగ్‌లోనైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా" అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ డ్రామా

కాగా, తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ అన్నీ కూడా భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని చెప్పేలా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ జోరుగా నడుస్తోంది.

ఇకపోతే జన నాయగన్ సినిమాలో విజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్స్ పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం జన నాయగన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

దళపతి విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను స్థాపించి 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా అభివర్ణిస్తున్నారు.

ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఏదేమైనా, జన నాయగన్ ఏఐ వివాదం సినిమాపై హైప్‌ను పెంచుతుందో లేక డ్యామేజ్ చేస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More