దళపతి విజయ్ లాస్ట్ మూవీ-అదిరిపోయిన జన నాయకుడు ట్రైలర్-భగవంత్ కేసరి కథలాగే ఉందనే కామెంట్లు!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. తెలుగులో జన నాయకుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. యాక్షన్ తో విజయ్ అదరగొట్టాడు కానీ ఈ మూవీ స్టోరీ భగవంత్ కేసరిని గుర్తు చేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Published on: Jan 3, 2026, 19:13:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా ట్రైలర్ శనివారం (జనవరి 3) రిలీజైంది. దళపతి యాక్షన్ స్టైల్ తో జన నాయకుడు ట్రైలర్ అదిరిపోయింది. కానీ ఈ మూవీ స్టోరీ తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి కథలాగే ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

జన నాయకుడు ట్రైలర్ లో దళపతి విజయ్ (youtube)
జన నాయకుడు ట్రైలర్ లో దళపతి విజయ్ (youtube)

జన నాయకుడు ట్రైలర్

విజయ్ దళపతి హీరోగా యాక్ట్ చేస్తున్న చివరి సినిమా ‘జన నాయకుడు’. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. కూతురి సెంటిమెంట్, కూతురిని ఆర్మీలో చేర్చాలనే తండ్రి ప్రయత్నం, ఇండియాను ధ్వంసం చేయాలనుకునే విలన్, మధ్యలో హీరో పొలిటికల్ టర్న్.. ఇలా జన నాయకుడు స్టోరీ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డైలాగ్స్ తో, ఫైట్ సీక్వెన్స్ తో దళపతి విజయ్ ఎప్పటిలాగే అదరగొట్టాడు.

దళపతిని ముట్టుకోకు

‘‘పంబ రేగకొట్టడంలో రికార్డు ఉన్న వాడి పేరు విన్నావా? అతనే దళపతి. ముట్టుకోకు, ముక్కలు చేసేస్తాడు’’ అని హీరోకు ఓ పెద్దాయన ఎలివేషన్ ఇస్తుండటంతో జన నాయకుడు ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘‘నేను సాధారణ మ్యాన్ బేబీ, చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయంటారు’’, ‘‘ఆడపిల్లలకు భయం ఉండకూడదు, విజ్జీని పులిలా పెంచాలి’’ అని విజయ్ డైలాగ్స్ చెప్తాడు. ఆర్మీ అప్లికేషన్లో సరిగ్గా సైన్ చేయమని విజ్జీని అడుగుతుంటాడు. దళపతి కూతురిగా మమితా బైజు కనిపించింది.

విలన్ బాబీ డియోల్

జన నాయకుడు సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా బాబీ డియోల్ నటించాడు. పొలిటీషియన్ గా ప్రకాష్ రాజ్ కనిపించాడు. ప్లాన్ ఓఎం, విధ్వంసం అంటూ విలన్ ప్లాన్ వేస్తాడు. మరోవైపు ‘‘నాకు ఈ ఆర్మీ వద్దు. చేతులు ఎలా వణుకుతున్నాయో చూడు’’ అని విజ్జీ భయపడుతుంది. ‘‘విజ్జీ భయం వెనుక ఏదో కారణం ఉంది. అది తెలిస్తే మీ దేశానికి రాబోయే ప్రాబ్లెమ్ ను కూడా అడ్డుకోవచ్చు’’ అని విజయ్ చెప్పే డైలాగ్ వెనుక ఏదో మిస్టరీ ఉందనిపిస్తుంది.

ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు, నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో అని విలన్ బాబీ డియోల్ డైలాగ్ చెప్తుంటే విజయ్ నవ్వుతూ రిప్లే ఇస్తాడు. తిరిగేళ్లే ఐడియానే లేదు.. ఐయామ్ కమింగ్ అనే విజయ్ డైలాగ్ అతని రాజకీయ ఎంట్రీని కూడా చాటేలా ఉంది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.

భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ భగవంత్ కేసరి. భేటీకో షేర్ బనావో అనే మోటోతో 2023లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

జన నాయకుడు మూవీ భగవంత్ కేసరి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదని, విషయాన్ని దాచిపెడుతున్నారని అనిల్ రావిపూడి చెప్పాడు. ఇప్పుడు ట్రైలర్ చూస్తేనేమో భగవంత్ కేసరి కథనే తీసుకుని పొలిటికల్ యాంగిల్ యాడ్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జన నాయకుడు ట్రైలర్ లో కనిపించిన భారీ ఫైట్ సీన్, జైల్లో ఖైదీ, గతంలో పోలీస్, బిడ్డను ఆర్మీలోకి పంపాలనుకోవడం.. ఇవన్నీ భగవంత్ కేసరిలో ఉన్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More