దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేకా? వాళ్లు కూడా దాచిపెట్టి చెబుతున్నారన్న అనిల్ రావిపూడి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’.. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు జోరందుకున్నాయి. దీనిపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడిని అడగ్గా ఆయన స్పందించారు. ఆ డైరెక్టర్ వాళ్లు కూడా దాచిపెట్టి చెబుతున్నారని, అది విజయ్ మూవీలాగే చూద్దామని అనిల్ రావిపూడి అన్నారు.

Dec 31, 2025, 15:33:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Thalapathy 69)పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేకా? వాళ్లు కూడా దాచిపెట్టి చెబుతున్నారన్న అనిల్ రావిపూడి
దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేకా? వాళ్లు కూడా దాచిపెట్టి చెబుతున్నారన్న అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ నటించిన 2023 బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి దళపతి విజయ్ నటించే జన నాయగన్ రీమేక్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై తాజాగా భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడిని మీడియా అడగ్గా ఆయన ఇంట్రెస్టింగ్‌గా సమాధానం ఇచ్చారు.

అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

చిరంజీవితో తెరకెక్కిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడిని మీడియా ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జన నాయగన్’ రీమేక్ గురించి ప్రశ్నించగా, అనిల్ రావిపూడీ చాలా తెలివిగా బదులిచ్చారు.

"నిజానికి వాళ్లు కూడా చాలా దాచిపెట్టి చెబుతున్నారు డైరెక్టర్ కూడా. కొంతమంది అది రీమేక్ అంటున్నారు, మరికొంతమంది కాదు అంటున్నారు. ఇది దళపతి విజయ్ గారి సినిమా అని ఆ డైరెక్టర్ గారు చెప్పారు. కాబట్టి, ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆ సినిమా లాగే ట్రీట్ చేద్దాం" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.

"వారిసు షూటింగ్ సమయంలో విజయ్ గారిని నేను రెండు సార్లు కలిశాను. ఆయన సూపర్బ్ జెంటిల్‌మెన్. ఆయన పొలిటికల్‌గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం. దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక అదేంటో కచ్చితంగా అందరికి తెలుస్తుంది" అని అనిల్ రావిపూడి చెప్పారు.

"ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడటం కరెక్ట్. కాబట్టి రిలీజ్ అయ్యేంతవరకు అది ఆ రీమేకా ఈ రీమేకా అని కాకుండా.. దాంట్లో వాళ్లు ఏం చేశారో అనేది రిజల్ట్ తర్వాత చూస్తే అర్థం అవుతుంది. అప్పటివరకు అది దళపతి విజయ్ ఫిల్మ్ అంతే" అని అనిల్ రావిపూడి ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెచ్. వినోద్ స్పందన

ఇదిలా ఉంటే మరోవైపు జన నాయగన్ దర్శకుడు హెచ్. వినోద్ కూడా ఈ రీమేక్ వార్తలపై మౌనం వీడారు. "ఇది నూటికి నూరు శాతం ‘దళపతి’ సినిమా. కొంతమంది ఇది రీమేక్ అని, మళ్లీ ఎందుకు చూడాలని అనుకోవచ్చు. వారికి నేను ఒకటే చెబుతాను.. మొదటి షో ముగిసే వరకు వేచి చూడండి. మీకే సమాధానం దొరుకుతుంది. ఇది రీమేకా లేదా కొన్ని సీన్లు స్ఫూర్తిగా తీసుకున్నారా అనే ఆందోళన అభిమానులకు అక్కర్లేదు" అని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో చర్చలు

గతంలో నటుడు వీటీవీ గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ ‘భగవంత్ కేసరి’ సినిమాను ఐదుసార్లు చూశారని, అనిల్ రావిపూడితో దీనిపై చర్చలు జరిపారని చెప్పారు. అప్పుడు అనిల్ ఈ వార్తలను ఖండించలేదు కానీ, సమయం సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని చర్చలు ఆగిపోయాయని సున్నితంగా చెప్పారు.

ప్రస్తుతం ‘జన నాయగన్’ సినిమాను ‘భగవంత్ కేసరి’ని నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే, జన నాయగన్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే చేస్తోంది.

మమిత బైజు కీలక పాత్ర

బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. మమిత బైజు కీలక పాత్ర పోషిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి (పొంగల్) కానుకగా విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More