రెండో రోజు పెరిగిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్ సొంత ఇండస్ట్రీలోనే తక్కువ ఓపెనింగ్స్- పూజా హెగ్డే మూవీనే టార్గెట్!

తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: ధనుష్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏకంగా రూ. 33 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. మరి రెండు రోజుల్లో తేరే ఇష్క్ మే కలెక్షన్స్ రిపోర్ట్‌పై లుక్కేద్దాం.

Nov 30, 2025, 06:53:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో ధనుష్, హిందీ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తేరే ఇష్క్ మే. లవ్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల అయింది.

రెండో రోజు పెరిగిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్ సొంత ఇండస్ట్రీలోనే తక్కువ ఓపెనింగ్స్- పూజా హెగ్డే మూవీనే టార్గెట్!
రెండో రోజు పెరిగిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- ధనుష్ సొంత ఇండస్ట్రీలోనే తక్కువ ఓపెనింగ్స్- పూజా హెగ్డే మూవీనే టార్గెట్!

స్ట్రాంగ్ ఓపెనింగ్స్

రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తేరే ఇష్క్ మే మంచి రివ్యూలను అందుకుంటోంది. హాలీడే కాకున్నా తొలి రోజు శుక్రవారం స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. విడుదలైన రెండవ రోజున ఈ చిత్రం అలాగే దూకుడు కొనసాగించిందా? ఇప్పటి వరకు తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను వివరంగా చూద్దాం.

సొంత సినీ ఇండస్ట్రీలోనే తక్కువ

తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 16 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో హిందీ నుంచి రూ. 15.25 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా కేవలం 75 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట్రీ నుంచే అతి తక్కువగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

తేరే ఇష్క్ మే కలెక్షన్స్ డే 2

ఇక రెండో రోజు అయిన శనివారం (నవంబర్ 29) తేరే ఇష్క్ మే సినిమాకు భారతదేశంలో రూ. 17 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున మరింతగా తేరే మేరే ఇష్క్ కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండు రోజుల్లో ఇండియాలో తేరే మేరే ఇష్క్ సినిమాకు రూ. 33 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

ఎమర్జెన్సీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్

అయితే, తేరే మేరే ఇష్క్ రెండు రోజుల కలెక్షన్స్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రతిష్టాత్మక చిత్రం ఎమర్జెన్సీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఎమర్జెన్సీ మూవీకి ఓవరాల్‌గా ఇండియాలో రూ. 23.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ మూవీ జీవితకాలపు వసూళ్లను ధనుష్, కృతి సనన్ చిత్రం 2 రోజుల్లో దాటేసింది.

పూజా హెగ్డే మూవీనే టార్గెట్

ఇక ఇప్పుడు షాహిద్ కపూర్, పూజా హెగ్డేల యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను బీట్ చేసే పనిలో పడింది తేరే మేరే ఇష్క్. దేవా సినిమాకు ఇండియాలో ఓవరాల్‌గా రూ. 55.8 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఈ టార్గెట్‌ను కూడా తేరే ఇష్క్ మే చేధించేలా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More