ఓటీటీలోకి నిన్న రిలీజైన ధనుష్, కృతి సనన్ రొమాంటిక్ థ్రిల్లర్- 7.1 రేటింగ్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ తేరే ఇష్క్ మే స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. 7.1 రేటింగ్ సాధించిన తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
థియేటర్లలలో విడుదలైన వెంటనే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆడియెన్స్‌కు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్‌పై కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది.

ధనుష్ కృతి సనన్ జంటగా
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన సినిమానే తేరే ఇష్క్ మే. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇదివరకు ధనుష్‌తో రాంజానా, ఆత్రంగి రే సినిమాలను డైరెక్ట్ చేశారు ఆనంద్ ఎల్ రాయ్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు సినిమాలు బ్యూటిఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ హిట్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.
పాజిటివ్ రివ్యూస్
అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్‌లో వచ్చిన తేరే ఇష్క్ మే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితగినట్టులాగనే ట్రైలర్ కూడా ఉండటంతో క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా తేరే ఇష్క్ మే సినిమా విడుదలైంది. సినిమాకు మంచి రివ్యూసే వస్తున్నాయి. పాజిటివ్ టాక్ నడుస్తోంది.
తేరే ఇష్క్ మే కలెక్షన్స్ అండ్ రేటింగ్
తొలి రోజు ఇండియాలో రూ. 16.50 కోట్ల నెట్ కలెక్షన్స్ కూడా రాబట్టింది తేరే ఇష్క్ మే సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి పదికి 7.1 రేటింగ్ కూడా సాధించుకుంది ఈ మూవీ. ఇంత మంచి క్రేజ్ తెచ్చుకుంటోన్న నేపథ్యంలో తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది.
తేరే ఇష్క్ మే ఓటీటీ రైట్స్
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తేరే ఇష్క్ మే ఓటీటీ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ ప్రీమియర్ అవనుందని టాక్. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత తేరే ఇష్క్ మే ఓటీటీ స్ట్రీమింగ్ ఉండొచ్చు.
ఓటీటీ రిలీజ్‌లో మార్పులు
అలా కాకుంటే బాక్సాఫీస్ కలెక్షన్స్, మౌత్ టాక్ ఇతరత్రా అంశాలను బట్టి తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తేరే ఇష్క్ మే మూవీ ఒక లవ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా. యూనివర్సిటీలో థీసిస్ కోసం హీరోను హెల్ప్ అడుగుతుంది హీరోయిన్.
తేరే ఇష్క్ మే కథ
ఈ క్రమంలో హీరోయిన్‌తో ప్రేమలో పడిపోతాడు హీరో. అయితే, రీసెర్చ్ థీసిస్ ముగిసిపోయాక హీరోతో బ్రేకప్ చెప్పి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటుంది హీరోయిన్. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? హీరోయిన్ ఎందుకు బ్రేకప్ చెప్పింది? హీరో ఏమయ్యాడు? పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన హీరోయిన్ హీరోను చాలా కాలం తర్వాత ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే తేరే ఇష్క్ మే చూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


