ఓటీటీలోకి వచ్చేసి తెలుగు బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ మూవీ- హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్- 9 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం ప్రేమిస్తున్నా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంతగానో అలరించిన సాత్విక్ వర్మ హీరోగా చేసిన ఈ మూవీలో ప్రీతి నేహా హీరోయిన్‌గా చేసింది. ఐఎమ్‌డీబీ నుంచి 9 రేటింగ్ అందుకున్న ప్రేమిస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఈ వారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో తెలుగులో బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమానే ప్రేమిస్తున్నా. తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి అలరించాడు సాత్విక్ వర్మ. అలాంటి సాత్విక్ వర్మ హీరోగా నటించిన సినిమానే ప్రేమిస్తున్నా.

హీరోయిన్‌గా ప్రీతి నేహా
ప్రేమిస్తున్నా సినిమాలో సాత్విక్ వర్మకు జోడీగా హీరోయిన్‌గా ప్రీతి నేహా చేసింది. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా ప్రేమిస్తున్నా మూవీని నిర్మించారు. అలాగే, ప్రేమిస్తున్నా మూవీకి భాను దర్శకత్వం వహించారు.
మంచి మౌత్ టాక్
సరికొత్త ప్రేమకథగా ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదలై మంచి మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు.
అన్‌కండిషనల్ లవ్ మూవీగా
దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్‌కు చూపించారు. అన్‌కండిషనల్ లవ్‌తో తెరకెక్కిన సినిమాగా ప్రేమిస్తున్నా టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకు తెలుగులో అంత అన్‌కండీషనల్ లవ్‌తో ఏ సినిమా రాలేదని పలు ఇంటర్వ్యూల్లో మేకర్స్ తెలిపారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్ 9
అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్‌తో ప్రేమిస్తున్నా మంచి టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 9 రేటింగ్ కూడా సాధించుకుంది. అలాంటి ప్రేమిస్తున్నా ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం 21 రోజుల్లోనే ప్రేమిస్తున్నా ఓటీటీ రిలీజ్ అయింది.
నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆహాలో ప్రేమిస్తున్నా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. నిన్న అంటే నవంబర్ 28 నుంచి ఆహాలో ప్రేమిస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో మిస్ అయిన ఆడియెన్స్ ప్రేమిస్తున్నా మూవీనీ ఆహా ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.
డైరెక్ట్ రొమాన్స్ అడిగే హీరో
ఇదిలా ఉంటే, హీరోయిన్‌ను లవ్‌కు బదులు డైరెక్ట్ రొమాన్స్ అడిగే హీరో కథతో ప్రేమిస్తున్నా తెరకెక్కింది. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు సంపాదించుకుంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా
అనిల్ కుమార్ అచ్చు గట్ల ప్రేమిస్తున్నా మూవీకి సంభాషణలు రాశారు. కాగా, హీరోగా చేసిన సాత్విక్ వర్మ రేసు గుర్రం, బాహుబలి వంటి హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


