50 కోట్లు దాటేసిన బాహుబలి ది ఎపిక్.. 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే! ఎక్కడ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ప్రభాస్, రానా దగ్గుబాటి హీరో విలన్‌గా, అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్‌గా నటించిన సినిమా బాహుబలి: ది ఎపిక్. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అక్టోబర్ 31న రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ ఆరు రోజుల్లో ఎన్నో కోట్లు రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 6, 2025, 12:58:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమాలను కలిపి రూపొందించిన మూవీ 'బాహుబలి: ది ఎపిక్'. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ రీమాస్టర్ వెర్షన్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది.

50 కోట్లు దాటేసిన బాహుబలి ది ఎపిక్.. 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే! ఎక్కడ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయంటే? (Screengrab @YouTube | trailer)
50 కోట్లు దాటేసిన బాహుబలి ది ఎపిక్.. 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే! ఎక్కడ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయంటే? (Screengrab @YouTube | trailer)

బాహుబలి ది ఎపిక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

తొలి రోజు నుంచి మంచి కలెక్షన్స్ అందుకున్న బాహుబలి ది ఎపిక్ ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ను దాటేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా బాహుబలి సినిమాకు ఆరు రోజుల్లో రూ. 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.

7 రోజుల కలెక్షన్స్ ఇలా

అలాగే, కర్ణాటక నుంచి రూ. 5 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ. 12 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఏడు రోజుల్లో బాహుబలి ది ఎపిక్ మూవీ రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.

బాహుబలి ది ఎపిక్ నెట్ కలెక్షన్స్

ఇదిలా ఉంటే, ఇండియాలో ఆరో రోజున బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 1.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ సంస్థ పేర్కొంది. దీంతో ఆరు రోజుల్లో ఇండియాలో బాహుబలి ది ఎపిక్ మూవీకి రూ. 29.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

బాహుబలి ది ఎపిక్ ఆక్యుపెన్సీ

అంటే, రూ. 30 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్‌కు బాహుబలి ది ఎపిక్ చేరువలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నవంబర్ 5న తెలుగులో బాహుబలి ది ఎపిక్ సినిమాకు ఉదయం 13.13 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. అది మధ్యాహ్నానికి 16.33 శాతంగా పెరిగింది.

హిందీ-తమిళంలో

ఇక హిందీ వెర్షన్‌కు ఉదయం పూట 9.96 శాతం ఆక్యుపెన్సీ రాగా మధ్యాహ్నాం 12.06 శాతానికి ఎగబాకింది. అలాగే, తమిళంలో 20.40 శాతం రాగా నైట్ షోలకు వచ్చేసరికి 25.07 శాతానికి బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగినట్లు సమాచారం.

బాహుబలి ది ఎపిక్ స్క్రీనింగ్స్

కాగా, బాహుబలి ది ఎపిక్ ప్రదర్శనల పరంగా చూస్తే తెలుగు వెర్షన్ హైదరాబాద్ (324 షోలు) అధిక షోలతో ఉంది. ఆ తర్వాత హిందీ వెర్షన్ ఢిల్లీ-ఎన్సీఆర్‌లో (176 షోలు), బెంగళూరు (133 షోలు), ముంబై (87 షోలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళ వెర్షన్ చెన్నైలో 55 షోలలో ఆడుతూ అతి తక్కువ స్క్రీనింగ్‌ను నమోదు చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More