రెండో రోజు దారుణంగా పడిపోయిన బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్- ప్రభాస్, అనుష్క మూవీకి 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా నటించిన టాలీవుడ్ మూవీ బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్ చేసింది. కానీ, రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది ఎపిక్ 2 రోజుల కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

Published on: Nov 2, 2025, 07:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాహుబలి ది ఎపిక్ 2 రోజుల కలెక్షన్స్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ వంటి రెండు బ్లాక్ బస్టర్లను ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ టైటిల్‌తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

బాహుబలి ది ఎపిక్ రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ (X)
బాహుబలి ది ఎపిక్ రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ (X)

అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి

అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి తొలిరోజున రూ. 10.8 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.15 కోట్లు వచ్చాయి.

ఏరియాల వారీగా

అలాగే, మొదటి రోజున వచ్చిన రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ. 7.9 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 1.35 కోట్లు, కన్నడ నుంచి 2 లక్షలు, మలయాళం నుంచి 18 లక్షలు, తమిళంలో 2 లక్షల వరకు వసూళ్లు ఉన్నాయి.

రెండో రోజు పడిపోయిన కలెక్షన్స్

ఇక రెండో రోజున అంటే నవంబర్ 1న బాహుబలి ది ఎపిక్ సినిమాకు ఇండియాలో రూ. 7.1 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున దారుణంగా బాహుబలి ది ఎపిక్ వసూళ్లు పడిపోయాయి. రెండో రోజు వచ్చిన రూ. 7.1 కోట్లల్లో తెలుగు నుంచి 4.75 కోట్లు, హిందీ ద్వారా 1.65 కోట్లు వచ్చాయి.

26.42 శాతం తగ్గిన వసూళ్లు

అలాగే, తమిళంలో 5 లక్షలు, కన్నడలో 3 లక్షలు, మలయాళం ద్వారా 17 లక్షలుగా రెండో రోజు బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, తొలి రోజుతో పోలిస్తే రెండో రోజున బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ 26.42 శాతం పడిపోయాయి. ఇక రెండు రోజుల్లో కలిపి భారతదేశంలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 17.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ

ఇదిలా ఉంటే, రెండో రోజున తెలుగులో బాహుబలి ది ఎపిక్ మూవీకి మొత్తంగా 53.04 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీంట్లో ఉదయం 37.34 శాతం, మధ్యాహ్నా 58.56 శాతం, సాయంత్రం 58.02 శాతం, రాత్రి 58.22 శాతంగా బాహుబలి ది ఎపిక్ నవంబర్ 1 థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది.

లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న

కాగా, అర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన బాహుబలి ది ఎపిక్ చిత్రం 225 నిమిషాల నిడివితో ఇప్పటివరకు నిర్మించిన లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

బాహుబలి ది ఎపిక్ రోల్స్

ఇక బాహుబలి ది ఎపిక్ మూవీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, అడివి శేష్ ఇతర పాత్రల్లో మెప్పించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More