బాహుబలి ది ఎపిక్ తొలి రోజు కలెక్షన్స్ ఇవే- మహేశ్ బాబు, దళపతి విజయ్ సినిమాల రీ రిలీజ్ వసూళ్లు అవుట్- అడ్వాన్స్‌తో ఎంతంటే?
రాజమౌళి తెరకెక్కించిన సరికొత్త ఫార్మాట్ మూవీ బాహుబలి ది ఎపిక్. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' రెండు సినిమాలను ఒక్కటిగా చేసిన బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న రిలీజ్ అయింది. బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.
దర్శక దిగ్గజం రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' భారీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలను ఒక్కటిగా మలిచి రూపొందించిన మూవీనే 'బాహుబలి ది ఎపిక్'.

పాజిటివ్ రివ్యూలు
ఎన్నో అంచనాలతో బాహుబలి ది ఎపిక్ మూవీ అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్, రివ్యూలు తెచ్చుకుంటోంది. అలాగే, మూవీకి బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం.
అడ్వాన్స్ బుకింగ్స్
ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం బాహుబలి ది ఎపిక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుకున్న సినిమాగా బాహుబలి ది ఎపిక్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక విడుదలైన అక్టోబర్ 31న సేల్ అయిన టికెట్స్ ద్వారా రూ. 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్
అంటే, అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజ్ అయన తొలి రోజు రెండు కలుపుకుని బాహుబలి ది ఎపిక్ మూవీకి రూ. 10.4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. దీంతో దళపతి విజయ్ నటించిన గిల్లీ (రూ. 4.87 కోట్లు), మహేశ్ బాబు ఖలేజా (రూ. 5.75 కోట్లు) రీ రిలీజ్ తొలి రోజు కలెక్షన్స్‌ను బీట్ చేసింది బాహుబలి ది ఎపిక్ మూవీ.
ఆ రెండు హిట్ సినిమాలను దాటి
అంతేకాకుండా ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన కొత్త లోక చాప్టర్ 1 చంద్ర (రూ. 2.71 కోట్లు), డ్రాగన్ (రూ. 6.5 కోట్లు) సినిమాల డే 1 కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది రాజమౌళి-ప్రభాస్ మూవీ. ఇదిలా ఉంటే, బాహబలి ది ఎపిక్ ఆర్కా మీడియా సమర్పించింది.
కొన్ని సీన్స్ యాడ్
3గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న బాహుబలి ది ఎపిక్ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాహుబలి ది ఎపిక్ నటీనటులు
ఇకపోతే బాహుబలి ది ఎపిక్ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించగా రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అడవి శేష్, కిచ్చా సుదీప్ తదితరులు ఇతర కీ రోల్స్ చేశారు.
బాహుబలి ది ఎపిక్ థియేటర్స్
బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,150 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. వీటిలో యుఎస్‌లో 400కి పైగా స్క్రీన్లు, యుకె, ఐర్లాండ్‌లో 210 థియేటర్లలో విడుదలైంది. ఇంకా, యుఎఈ, ఆస్ట్రేలియా , ఆగ్నేయాసియాలో కూడా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


