ఓటీటీలోకి నిన్న రిలీజైన రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా- హీరోకు 3 కోట్ల సాయం చేసే అభిమాని కథ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఉపేంద్ర స్క్రీన్ హీరోగా నటించిన ఈ మూవీకు మంచి టాక్ వస్తోంది. హీరోకు 3 కోట్లు సాయం చేసే అభిమాని కథగా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మంచి హిట్ అందుకుని చాలా కాలం అయింది. మొన్నటివరకు ఉస్తాద్ అని ట్యాగ్‌తో కనపడిని రామ్ పోతినేని పేరు ఇప్పుడు ఇదివరకటి ఎనర్జిటిక్ స్టార్‌గా కనిపిస్తోంది. పేరు మార్పో ఏంటీ తెలియదు కానీ రామ్ పోతినేనికి చాలా కాలం తర్వాత మంచి హిట్ పడిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఆంధ్రా కింగ్‌గా ఉపేంద్ర
రామ్ పోతినేనిని హిట్ ఇచ్చిన సినిమానే ఆంధ్రా కింగ్ తాలూకా. హార్ట్ కోర్ అభిమానిగా రామ్ పోతినేని నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. అలాగే, రామ్ పోతినేనికి జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్‌గా యాక్ట్ చేశాడు.
ఆంధ్రా కింగ్ నటీనటులు
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఆంధ్రా కింగ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రాహల్ రవీంద్రన్, రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, తులసి, వీటీవీ గణేష్, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మంచి రివ్యూస్
భారీ అంచనాలతో నవంబర్ 27న అంటే నిన్న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. ఈ సినిమాకు రివ్యూస్ నుంచి ఆడియెన్స్ వరకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఒక అభిమాని కథను బాగా చూపించారని డైరెక్టర్‌ను మెచ్చుకుంటున్నారు.
హీరోకు 3 కోట్ల సాయం
అలాగే, హీరోకు రూ. 3 కోట్ల సాయం చేసే పిచ్చి అభిమాని పాత్రలో రామ్ పోతినేని ఎనర్జిటిక్‌గా అలరించాడని అంటున్నారు. ఉపేంద్ర స్క్రీన్ ప్రజెన్స్ ఇంపాక్ట్ చూపించేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ నటనతో మరోసారి మెప్పించిందని ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇంత మంచి టాక్ తెచ్చుకుంటున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8 రేటింగ్ ఉండటం విశేషంగా మారింది. ఇలా ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంది. మంచి ధర వెచ్చించి ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆంధ్రా కింగ్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే, సినిమాకు వచ్చే టాక్, బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి ఆంధ్రా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఆంధ్రా కింగ్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ జీ దక్కించుకున్నట్లు సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


