హారర్ మూవీతో ఎంట్రీ- ముద్ద మందారం సీరియల్‌తో క్రేజ్- బిగ్ బాస్ 9 విన్నర్ రేస్‌లో లేడి సింగం- తనూజ గౌడ గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్ రేసులో దూసుకుపోతుంది బ్యూటిపుల్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో హారర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ముద్ద మందారం సీరియల్‌లో హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ అందుకుంది. మరి తనూజ గౌడ బ్యాక్‌గ్రౌండ్‌పై ఓ లుక్కేద్దామా.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఈ వారంతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వీక్ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం 8 మంది నామినేట్ కాగా వారిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

టాప్ 1 స్థానంతో
ఇదిలా ఉంటే ఈ వారం లాగే ప్రతివారం సీరియల్ బ్యూటీ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి టాప్ 1 స్థానంతో బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ ఓటింగ్‌లోనే కాదు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ టైటిల్ విన్నర్ రేస్‌లో కూడా తనూజ ముందంజలో ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ 9 తెలుగులో సీరియల్ హీరోయిన్‌గా అడుగుపెట్టిన తనూజ గౌడ తన గేమ్‌తో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక క్రమంలో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ, తనూజకే బీబీ టీమ్ ఫేవర్ చేస్తుందంటూ ఫేక్ రూమర్స్ తెగ ప్రచారం కూడా జరిగాయి. అదంతా కల్యాణ్ పడాలకు ఉన్న టైటిల్ విన్నర్ రేస్ పోటీ నుంచి తప్పంచాలనే చేసినట్లు కొంతమంది రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
హారర్ మూవీతో
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో లేడి సింగంగా పేరు తెచ్చుకున్న తనూజ గౌడ హారర్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 1992 మార్చి 5న కర్ణాటకలోని బెంగళూరులో తనూజ పుట్టస్వామి జన్మించింది. తల్లిదండ్రులు పుట్టస్వామి, పార్వతి. తనూజకు అనూజ, పూజ అని ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.
చదువు పూర్తయ్యాక నేరుగా సినీ రంగంలోకి అడుగుపెట్టంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ సినీ ఇండస్ట్రీలో 6-5=2 అనే హారర్ థ్రిల్లర్ మూవీతో నటిగా పరిచయం అయింది తనూజ పుట్టస్వామి. ఈ సినిమాను తెలుగులో చిత్రం కాదు నిజం అనే టైటిల్‌తో డబ్ చేశారు. అంటే ఇదే హారర్ మూవీతో తెలుగులో కూడా నటిగా ఇంట్రడ్యూస్ అయింది తనూజ.
అందాల రాక్షసి సీరియల్‌తో
ఆ తర్వాత దండే బాయ్స్ అనే సినిమాలో నటించింది. అనంతం తెలుగు బుల్లితెరపై అందాల రాక్షసి సీరియల్‌తో అరంగేట్రం చేసింది తనూజ గౌడ. దీని తర్వాత జీ తెలుగులో ముద్ద మందారం సీరియల్‌లో హీరోయిన్‌గా చేసింది తనూజ గౌడ.
పవన్ సాయి హీరోగా చేసిన ముద్ద మందారం సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిఫుల్ తనూజ గౌడ. ఈ సీరియల్ ఏకంగా 1500 ఎపిసోడ్స్‌తో మంచి పాపులర్ అయింది. అనంతరం అగ్ని పరీక్ష అనే మరో సీరియల్‌లో కూడా యాక్ట్ చేసింది తనూజ గౌడ.
లేడి బిగ్ బాస్ విన్నర్‌గా
తమిళ బుల్లితెరపై కూడా తనూజ పుట్టస్వామి డెబ్యూ ఎంట్రీ ఇచ్చంది. శివ మనసుల శక్తి అనే సీరియల్‌తో తమిళనాట కూడా పాపులర్ అయింది. ఇవే కాకుండా తెలుగులో వచ్చిన కోర్ట్ లీగల్ థ్రిల్లర్ మూవీ లీగల్లీ వీర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది.
ఇలా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీరియల్స్, సినిమాలతో దూసుకుపోయిన తనూజ గౌడ బిగ్ బాస్ తెలుగు 9లో అదరగొడుతోంది. మరి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విజేతగా నిలిచి తనూజ పుట్టస్వామి లేడి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ అందుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


