బిగ్ బాస్‌లో ఇవాళ నో ఎలిమినేషన్- సీరియల్ హీరోయిన్‌తో గొడవే కారణం- శివాజీ బజ్ ఇంటర్వ్యూ రెడీ అయ్యాక కూడా మారిన ప్లాన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారానికి చేరుకుంది. 11వ వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో ఆరుగురు ఉండగా.. వారిలో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. హీరో శివాజీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన తర్వాత కూడా చివరి నిమిషంలో ఇవాళ్టీ ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.

Nov 23, 2025, 07:52:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, నామినేషన్స్ అరుపులతో వాడి వేడిగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే, గత రెండు వారాలు బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి.

బిగ్ బాస్‌లో ఇవాళ నో ఎలిమినేషన్- సీరియల్ హీరోయిన్‌తో గొడవే కారణం- శివాజీ బజ్ ఇంటర్వ్యూ రెడీ అయ్యాక కూడా మారిన ప్లాన్
బిగ్ బాస్‌లో ఇవాళ నో ఎలిమినేషన్- సీరియల్ హీరోయిన్‌తో గొడవే కారణం- శివాజీ బజ్ ఇంటర్వ్యూ రెడీ అయ్యాక కూడా మారిన ప్లాన్

నామినేషన్స్‌లో ఆరుగురు

కానీ, బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ శనివారం (నవంబర్ 22) నాడే పూర్తయిపోయింది. ఈ వారం బిగ్ బాస్‌లో భరణి శంకర్, ఇమ్మాన్యూయేల్, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, డిమాన్ పవన్, దివ్య నిఖితా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.

ఐదు, ఆరు స్థానాల్లో వారిద్దరు

వీరిలో టాప్ 1లో కల్యాణ్, టాప్ 2లో ఇమ్మాన్యూయెల్, 3వ స్థానంలో భరణి శంకర్, నాలుగో ప్లేసులో డిమాన్ పవన్ ఉన్నారు. వీరందరిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పలువురు సెలబ్రిటీలతో సేవ్ చేశారు. అయితే, ఐదో స్థానంలో హీరోయిన్ సంజన, ఆరో స్థానంలో దివ్య నిఖితా ఉన్నారు.

తనూజ గౌడతో దివ్య గొడవ

ఈ లెక్కన వీరిలో నుంచి దివ్య నిఖిత ఇవాళ ఎలిమినేట్ కావాల్సింది. కానీ, శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడతో దివ్య నిఖితాకు పెద్ద గొడవ జరిగింది. దాదాపు తనూజను దివ్య కొట్టేంత పని చేసింది. ఈ గొడవ కారణంగా, షోకి మరింత హైప్ పెరుగుతుందన్న ఉద్దేశంతో దివ్య నిఖిత ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేశారని రివ్యూవర్స్ చెబుతున్నారు.

శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ

అంతేకాకుండా ఈ వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ దివ్య నిఖితా అని, హీరో శివాజీ హోస్ట్‌గా చేసే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేశారని సమాచారం. చివరి నిమిషంలో ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట బీబీ టీమ్.

దివ్యకు బదులుగా

అయితే, ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ను మాత్రం కంటిన్యూ చేసింది బీబీ టీమ్. దివ్యకు బదులు చివరి ఆరో స్థానంలో హీరోయిన్ సంజన గల్రాని ఉందని, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్ దగ్గర ఉన్న పవర్ ఆస్త్రాను వాడుకునేలా బీబీ స్కెచ్ వేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవాళ లేని ఎలిమినేషన్

సంజనను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేందుకు ఇమ్మాన్యూయెల్ పవర్ ఆస్త్రా వాడినట్లు సమాచారం. ఇలా ఇవాళ అంటే బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేషన్ లేదని సమాచారం. కాబట్టి, ఈ వారం బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More