గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల ఉన్నారు.. నిఖిల్, గౌరవ్‌తో హీరో శివాజీ.. పంచ్‌లు, నవ్వులతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో పదో వారం సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయి హౌజ్ వీడారు. ఈ ఇద్దరిని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హీరో శివాజీ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నిఖిల్, గౌరవ్ ఉన్నారని శివాజీ కామెంట్స్ చేశాడు.

Published on: Nov 17, 2025, 13:05:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారానికి చేరుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 9 పదోవారంలో డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 9 తెలుగు గత వారం సీరియల్ నటులు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యారు. ఈ ఇద్దరితో ఒకేసారి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహించారు.

గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల ఉన్నారు.. నిఖిల్, గౌరవ్‌తో హీరో శివాజీ.. పంచ్‌లు, నవ్వులతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ!
గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల ఉన్నారు.. నిఖిల్, గౌరవ్‌తో హీరో శివాజీ.. పంచ్‌లు, నవ్వులతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ!

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల

ఈ బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో శివాజీ అడిగిన ప్రశ్నలకు నిఖిల్, గౌరవ్ నవ్వుతూనే సమాధానం చెప్పారు. ముందుగా నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి కలిసి అడుగుపెట్టారు. "ఆహా వీళ్లిద్దరిని చూస్తుంటే గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల లేరు (ఉన్నారనే అర్థంలో)" అని హీరో శివాజీ అన్నాడు.

హైడ్ అండ్ సీక్ బాగా ఆడావ్

దానికి నిఖిల్ నాయర్ షాక్ అయి "నిజమా.." అని అన్నాడు. "నిఖిల్ హౌజ్‌లో హైడ్ అండ్ సీక్ బాగా ఆడావ్. స్టార్టింగ్‌లో వెళ్లావ్. మళ్లీ ఇప్పుడే కనపడ్డావ్ నాకు. మధ్యలో అంతా హైడే (కనిపించలేదన్న అర్థంలో)" అని శివాజీ అన్నాడు. దానికి ముగ్గురు నవ్వారు.

జర్నలిస్ట్ అయ్యావేంటీ

"గౌరవ్ మీరేంటీ బేసిక్‌గా ఆర్టిస్టా" అని శివాజీ అడిగితే "అవును" అని గౌరవ్ చెప్పాడు. "మరి హౌజ్‌లోకి వెళ్లాకా జర్నలిస్ట్ అయ్యారేంటీ" అని పంచ్ ఇచ్చాడు శివాజీ. దానికి గౌరవ్ నవ్వాడు. "ఆడియెన్స్‌ను గెలవాలంటే.. హౌజ్‌మేట్స్‌ను గెలవాలి" అని శివాజీ అన్నాడు.

కనపడితే కదా పాయింట్స్ ఉండేది

"హౌజ్‌మేట్స్‌ను గెలిచాను. అందుకే నేను వచ్చిన ఐదో వారం నామినేషన్స్‌లో ఉన్నాను. వారికి నామినేట్ చేసేందుకు పాయింట్స్ లేవు" అని నిఖిల్ నాయర్ చెప్పుకొచ్చాడు. "పాయింట్స్ ఉండాలంటే మీరు కనపడాలి" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. దానికి "కరెక్టే కరెక్టే" అని గౌరవ్ అన్నాడు. "ఆడు చూడు కరెక్ట్ అంటున్నాడు" అని శివాజీ నవ్వుతూ అన్నాడు.

నాకు ఏం తెలియదు సర్

"క్లీన్ చేయాలంటే గొడవ, పిలిచారంటే గొడవ.. ఏంటీ ఈ గొడవలు" అని శివాజీ అడిగాడు. "నాకు ఏం తెలియదు సర్" అని గౌరవ్ అన్నాడు. "అదే కదా నేను చెప్పేది మీకు ఏం తెలియదూ.. ఎందుకు వెళ్లారు అని కదా" అని శివాజీ అన్నాడు. దానికి గౌరవ్ నవ్వాడు. "అడుగుతుంటే నవ్వుతావేంటీ గురు. ఓరి బాబు ఏంట్రా ఇది" అని శివాజీ అన్నాడు.

నేను పడుకుంటా

"నువ్వు అతను తప్పులు చెప్పు.. మీరు వాడు ఏం చేశాడో చెప్పు. మీరిద్దరు తప్పులు చెప్పండి. ఈలోపు నేను కాసేపు పడుకుంటా" అని సోఫాపై పడుకున్నాడు హీరో శివాజీ. దానికి ఇద్దరు నవ్వారు. అలా శివాజీతో నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ సాగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More