బిగ్‌బాస్‌లో ఫ్యామిలీ వీక్‌-చెల్లిని పెళ్లికూతురు చేసిన త‌నూజ‌-పాప‌తో ఆట‌లు-ఫుల్ ఎమోషనల్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ కు సమయం ఆసన్నమైంది. ఈ వారం హౌస్ లోని కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా తనూజ వాళ్ల చెల్లి, అక్క పాప వచ్చారు. 

Nov 18, 2025, 13:22:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్లు పండాలన్నా, హౌస్ మేట్స్ మరింత బలం రావాలన్నా ఫ్యామిలీ వీక్ రావాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఆ టైమ్ వచ్చేసింది. ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ ఈ వారమే. ముందుగా హౌస్ లోకి తనూజ అక్క కూతురు, చెల్లి వచ్చారు. హౌస్ అంతా ఫుల్ ఎమోషనల్ గా మారిపోయింది.

చెల్లి, పాపతో తనూజ (youtube)
చెల్లి, పాపతో తనూజ (youtube)

ఫ్యామిలీ వీక్

ఫ్యామిలీ వీక్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ వారం రానే వచ్చింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 11వ వారం ఫ్యామిలీ వీక్. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంటర్స్ రానున్నారు. ముందుగా కెప్టెన్ తనూజ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.

నా కూతురు

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఈ వారం ఫ్యామిలీ వీక్ లో ముందుగా తనూజకు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. తనూజ కన్ఫెషన్ రూమ్ కు వెళ్లగానే అక్కడ ఆమె అక్క పూజ కూతురు ఉంటుంది. ఆమెను చూడగానే తనూజ ఒక్కసారిగా సంతోషంతో తేలిపోతుంది. ఫుల్ ఎమోషనల్ అవుతుంది. అమ్మ ఎక్కుడుంది అంటూ కన్నడలో అడుగుతుంది. పాపను ఎత్తుకుని బయటకు వచ్చి, అందరికీ తన కూతురు వచ్చిందని చెప్పింది తనూజ.

చెల్లిని చూసి కన్నీళ్లు

మెయిన్ గేట్ లో నుంచి తనూజ చెల్లి అనూజ ఎంట్రీ ఇస్తుంది. అనూజను చూడగానే తనూజ ఏడ్చేసింది. తనే పెళ్లికూతురు అంటూ అందరికీ చెప్పింది. ‘‘కొన్ని రోజుల్లో నా పెళ్లి ఉంది. ఇక్కడ హ్యాండిల్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అమ్మ, పెళ్లిపనులు చూసుకుంటున్నాము. నువ్వు ఏడ్వకుండా ఉంటే చాలు’’ అని అనూజ చెప్తుంది.

పెళ్లి కూతురుగా

త్వరలోనే అనూజ పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను పెళ్లి కూతురు చేసే అవకాశాన్ని తనూజకు కల్పిస్తాడు బిగ్ బాస్. పెళ్లి కార్డులో తన పేరు చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. చెల్లికి బొట్టు పెట్టి, శారీ పెట్టి ఆశీర్వదిస్తుంది. మరోవైపు పాపతో హౌస్ మేట్స్ ఆడుకోవడం కనిపించింది. ముందుగానే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అని చెప్పడంతోనే హౌస్ మేట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ కొంచెం హైగానే ఉండే అవకాశముంది. మరి ఏ హౌస్ మేట్ ఏ ఫ్యామిలీ మెంబర్ వస్తారో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More