బిగ్ బాస్ ఓటింగ్ రివర్స్.. తనుజాకు షాక్.. దాటేసిన కల్యాణ్.. డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే! సుమన్ శెట్టి వీణ స్టెప్
బిగ్ బాస్ 9 తెలుగులో మరొక హౌస్ మేట్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే సమయం దగ్గర పడుతోంది. పదో వారం నామినేషన్లలో ఉన్న 10 మంది నుంచి ఒకరు వెళ్లిపోనున్నారు. ప్రస్తుతం ఓటింగ్ చూసుకుంటే తనుజాకు షాక్ తగిలినట్లే కనిపిస్తోంది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పుడు పదో వారం. ట్రోఫీ కోసం కంటెస్టెంట్లు అందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే ఈ వారం కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో వారం నామినేషన్లలో 10 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. వీళ్ల ప్రస్తుత ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం ప్రస్తుత ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనుజాకు షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. ప్రతి వారం నామినేషన్లోకి రావడం, టాప్ లో కొనసాగడం తనుజాకు అలవాటుగా మారింది. కానీ ఈ వారం మాత్రం ఓటింగ్ రివర్స్ అయింది. ప్రస్తుతం తనుజాను దాటేసి పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. ఈ వారం నామినేషన్లలో ఉన్న పది మందిలో కల్యాణ్ ఇప్పుడు నంబర్ వన్ గా ఓటింగ్ లో కొనసాగుతున్నాడు.
ఆ గొడవే కారణం
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కల్యాణ్ ను రాజుగా, రీతు, దివ్యను రాణులుగా నియమించాడు బిగ్ బాస్. వీళ్లకు తనుజ, సంజన, నిఖిల్, డీమాన్ పవన్ కమాండర్లు. ఇక మిగిలిన సుమన్ శెట్టి, భరణి, గౌరవ్, ఇమ్మాన్యుయేల్ కామన్ పీపుల్. అయితే ఈ కమాండర్లతో టాస్క్ లో గెలిచి కమాండర్ అయ్యే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే సంజన, సుమన్ బాక్స్ లతో టవర్ టాస్క్ ఆడారు. ఇద్దరూ ఒకే ఎత్తులో బాక్స్ లు పెట్టారు. కానీ సంజన టవర్ నిటారుగా ఉంది. సంచాలక్ గా ఉన్న కల్యాణ్ ఇదే నిర్ణయం చెప్పాడు.
కానీ తనుజ మాత్రం సుమన్ శెట్టి తరపున మాట్లాడింది. సుమన్ శెట్టి ఎఫర్ట్స్ కు విన్నర్ గా అనౌన్స చేయాలని పట్టుబట్టింది. దీంతో కల్యాణ్, తనుజ మధ్య మాటల వార్ జరిగింది. ఇందులో తప్పు ఎవరిదో ఆడియన్స్ కు బాగానే అర్థమైంది. ఈ గొడవ కారణంగానే ఓటింగ్ లో తనుజాను దాటి కల్యాణ్ పైకి వెళ్లినట్లు తెలుస్తోంది.
టాప్-5లో వీళ్లు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో వారం ఓటింగ్ లో ప్రస్తుతం టాప్-5లో వరుసగా కల్యాణ్ పడాల (31.24 శాతం), తనుజ (27.23 శాతం), భరణి (10.31 శాతం), సుమన్ శెట్టి (7.38 శాతం), సంజన గల్రానీ (5.16 శాతం) ఓటింగ్ తో ఉన్నారు. ఆ తర్వాత రీతు చౌదరి (4.51 శాతం), దివ్య నిఖిత (4.02 శాతం), గౌరవ్ గుప్తా (3.8 శాతం) ఉన్నారు.
డేంజర్ జోన్
ఈ వారం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం డేంజర్ జోన్లో డీమాన్ పవన్, నిఖిల్ నాయర్ ఉన్నారు. డీమాన్ పవన్ 3.67 ఓటింగ్ శాతం, నిఖిల్ నాయర్ 2.68 శాతం ఓటింగ్ తో చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లడం ఖాయమే.
సుమన్ డ్యాన్స్
ఇక ఈ వారం రాజు, రాణులుగా ఉన్న కల్యాణ్, రీతు, దివ్య కామన్ పీపుల్ తో సేవలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సుమన్ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయేల్ తో డ్యాన్స్ చేయించారు. చిరునవ్వు అంటే ఏంటో తెలుసా నవ్వుతూ చిరు (చిరంజీవి) స్టెప్స్ వేయాలని చెప్పి మరీ డ్యాన్స్ చేయించారు. సుమన్ శెట్టి ఏమో వీణా స్టెప్, భరణి ఏమో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ స్టెప్, ఇమ్మాన్యుయేల్ ముఠా మేస్త్రీ సాంగ్ స్టెప్ వేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


