బిగ్ బాస్ లో దెయ్యాలు.. భయంతో వణికిపోయి ఏడ్చేసిన తనూజ.. ఓటింగ్ డేంజర్ జోన్లో యంగ్ హీరో
బిగ్ బాస్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఈ వారం హౌస్ లో హారర్ థ్రిల్ కోసం ఘోస్ట్ రూమ్ సెట్ చేశారు. దానికి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఓటింగ్ చూసుకుంటే యంగ్ హీరో డేంజర్ జోన్లో ఉన్నాడు.
బిగ్ బాస్ తెలుగు నుంచి మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు సీజన్ 4లో ఘోస్ట్ రూమ్ లో అఖిల్, సోహైల్ చేసిన సందడి గుర్తే ఉంటుంది. దెయ్యాలకు భయపడుతూ వాళ్లు పండించిన కామెడీ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోని హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సీజన్ 9లోనూ మరోసారి ఘోస్ట్ రూమ్ తో కామెడీ పండించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం టాస్క్ ఇదే.

ఘోస్ట్ రూమ్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తొమ్మిదో వారం ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం టాస్క్ లో భాగంగా ఘోస్ట్ రూమ్ సెట్ చేసి అందులో కొన్ని ఐటెమ్స్ పెట్టి వాటిని టచ్ చేసి, స్మెల్ చూసి గెస్ చేయాలనేది టాస్క్. ఇందులో భాగంగా లోపలికి వెళ్లిన తనుజ భయంతో వణికిపోయింది. లోపల దెయ్యాల మాస్కులో ఉన్న మనుషులు, బొమ్మలు తెగ భయపెట్టాయి. దీంతో బయటకు ఏడుస్తూ వచ్చింది తనూజ
రీతు ఆడపులి
రీతు లోపలికి వెళ్తుంటే సంజన జాగ్రత్తలు చెబుతుంది. కానీ ఆడపులి అంటూ రీతు బిల్డప్ ఇస్తుంది. కానీ లోపలికి వెళ్లాక భయంతో అరిచేస్తుంది. ఇలా ఈ వారం ఘోస్ట్ రూమ్ తో ఆడియన్స్ కు కాస్త ఫన్ దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. మరి హౌస్ మేట్స్ రియాక్షన్ ఏ మేరకు నవ్వులు తెప్పిస్తాయో చూడాలి.
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్లు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తొమ్మిదో వారం నామినేషన్లలో ఏడుగురు ఉన్నారు. తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, సంజన గల్రానీ, రాము రాథోడ్, శ్రీనివాస్ సాయి నామినేషన్లలో ఉన్నారు. వీళ్లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావాల్సిందే.
డేంజర్ జోన్
ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయేందుకు డేంజర్ జోన్లో ఉన్నాడు యంగ్ హీరో శ్రీనివాస్ సాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుని, హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు శ్రీనివాస్. బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఈ వారంతో అతని కథ ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 4.48 శాతం ఓట్లతో అతను లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
టాప్ లో మళ్లీ ఆమె
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో నామినేషన్లకు రావడం, ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగడం సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామికి కామన్ అయిపోయింది. ఈ వారం కూడా ఆమె 32.4 శాతం ఓట్లతో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత కల్యాణ్ పడాల (19.61 శాతం), సుమన్ శెట్టి (15.96 శాతం), భరణి (10.62 శాతం), సంజన గల్రానీ (9.26 శాతం), రాము రాథోడ్ (7.67 శాతం) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో ఉన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


