డీమాన్‌తో రిలేష‌న్‌షిప్‌పై ఓపెన్ అయిన రీతు.. సుమ‌న్ సెల్ఫ్ నామినేట్‌.. ఈ వారం బిగ్ బాస్ నామినేష‌న్ల‌లో ఎవ‌రున్నారంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో మరో కొత్త వారం స్టార్ట్ అయింది. ఈ  సీజన్ తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలోనే డీమాన్ పవన్ తో తన రిలేషన్ షిప్ పై రీతు ఓపెన్ అయింది. 

Nov 3, 2025, 12:00:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగులో 8 వారాలు పూర్తయ్యాయి. గత వారం దివ్వెల మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్లలో సంజన్ వర్సెస్ రీతు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో డీమాన్ పవన్ తో ఉన్న రిలేషన్ షిప్ పై రీతు క్లారిటీ ఇచ్చింది.

రీతు చౌదరి (youtube)
రీతు చౌదరి (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా మారింది. కంటెస్టెంట్ల ఫొటోలోను ఒక్కో టెడ్డీ బేర్ మీద ఉంచారు. కంటెస్టెంట్లు తమ టెడ్డీ బేర్ కాకుండా ఇతరుల ఫొటో ఉన్న టెడ్డీ బేర్ ను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లాలి. చివరగా ఎవరు మిగిలితే వాళ్లతో పాటు వాళ్ల దగ్గరున్న టెడ్డీ బేర్ పై ఉన్న ఫొటోలోని కంటెస్టెంట్ నామినేషన్లలోకి వస్తారు. ఆ తర్వాత తమ రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. చివరకు హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం నామినేషన్ నిర్ణయిస్తారు.

రీతు వర్సెస్ సంజన

9వ వారం నామినేషన్లలో రీతు చౌదరి వర్సెస్ సంజన గల్రానీ మాటల యుద్ధం జరిగింది. రీతు గురించి పాయింట్లు మాట్లాడుతూ డీమాన్ పవన్ గురించి చెప్పింది సంజన. ‘‘ఫస్ట్ డే నుంచి నేను ఏదైనా చేస్తే ఒంటరిగా, ఒక సోలో ప్లేయర్ గానే చేశాను. ఎక్కడో రీతు ఆటలో డీమాన్ డెఫినెట్ కాంట్రిబ్యూషన్ ఉంది. అది మనందరికీ కనిపిస్తోంది’’ అని సంజన అంటుంది.

రిలేషన్ షిప్

వెంటనే రీతు రియాక్టవుతుంది. మీరు ఒక్క పర్సన్ తో మాట్లాడి సోలోగా ఉన్నాను, నాకు సపోర్ట్ లేదని మాట్లాడకండని రీతు అంటుంది. ‘మీకు ఎలా బాండ్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్ లో ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ మీకు రాంగ్ అయితే నేనేం చేయలేను’ అని క్లారిటీ గా చెప్పేసింది రీతు. రీతు కారణంగా డీమాన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు అడుగు దూరంలో నిలిచాడని సంజన చెప్పింది.

సుమన్ సెల్ఫ్

ఆ తర్వాత తనూజ, సుమన్ నామినేషన్ జోన్లో ఉంటారు. నాకు ఏ రీజన్ లేదని తనూజ అంటుంది. తను ఫేక్ కాదని, తనకు మాస్క్ లేదంటుంది. సుమన్ సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్తాడు. ఎమోషనల్ అవుతాడు సుమన్ శెట్టి. ఈ వారం నామినేషన్లలోకి ఇమ్మాన్యుయేల్ కూడా వచ్చాడు.

ఈ వారం వీళ్లే

బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారని తెలిసింది. భరణి, రాము, సుమన్, శ్రీనివాస్, కల్యాణ్, తనూజ, సంజన, ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యారని సమాచారం. ఇన్ని రోజులూ ఇమ్మాన్యుయేల్ ఓటింగ్ సంజనాకు పడింది. ఇప్పుడు ఇమ్ము, సంజన ఇద్దరూ నామినేషన్లలో ఉన్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More