హౌస్ మేట్స్ తో ఫొన్లో ఆడుకుంటున్న బిగ్ బాస్.. తనూజాను నమ్మని రీతు.. ఓటింగ్ టాప్ లో ఆ హీరోయిన్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఫోన్లో మాట్లాడుతూ కంటెస్టెంట్లను ఆడుకుంటున్నాడు. మరోవైపు ఈ వారం ఓటింగ్ టాప్ లో హీరోయిన్ కొనసాగుతోంది.
బిగ్ బాస్ 9 తెలుగులో కొత్త వారం వచ్చిందంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరగడం కామనే. కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ డిఫరెంట్ గా ఉంది. స్వయంగా బిగ్ బాస్ రంగంలోకి దిగి ఫోనోలో హౌస్ మేట్స్ తో ఆడుకుంటున్నాడు. మరోవైపు తనూజ మాటలను రీతు అస్సలు నమ్మదు. ఇక ఈ వారం ఓటింగ్ ఎలా ఉందో కూడా చూసేయండి.

బిగ్ బాస్ 9 టాస్క్
బిగ్ బాస్ 9 తెలుగులో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ నేరుగా రంగంలోకి దిగాడు. ఫోనోలో హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఆటాడిస్తున్నాడు. ఫస్ట్ ఫోన్ లో తనూజ మాట్లాడుతుంది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి అందరికీ చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు. తనూజ అదే చెప్తుంది. కానీ రీతు ఆమె మాటలను నమ్మదు. సీక్రెట్ టాస్క్ అని డౌట్ పడ్తుంది. గౌరవ్ ఏమో కాల్ లిఫ్ట్ చేస్తే కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారని అంటాడు.
రీతుతో బిగ్ బాస్
బిగ్ బాస్ మళ్లీ కాల్ చేస్తే సంజన లిఫ్ట్ చేస్తుంది. కానీ ఫోన్ ను రీతుకు ఇవ్వమంటాడు బిగ్ బాస్. రీతు.. మీరు తనూజ మాటలను నమ్ముతున్నారా? అని అడుగుతాడు బిగ్ బాస్. లేదు.. అని రీతు చెప్తుంది. వెరీ గుడ్.. ఈ టాస్క్ నమ్మకంతోనే సాగుతుందని ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. టాస్క్ ఇప్పటికే మొదలైందని చెప్పమంటాడు.
బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ మరోసారి టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెకు 33.81 శాతం ఓటింగ్ ఉంది. నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కల్యాణ్ పడాల 18.83 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సుమన్ శెట్టి 15.36 శాతం, భరణి 11 శాతం ఓటింగ్ తో వరుసగా మూడు, నాలుగు స్థానల్లో ఉన్నారు.
డేంజర్ లో శ్రీనివాస్
బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం ఓటింగ్ లో ప్రస్తుతం శ్రీనివాస్ సాయి డేంజర్ జోన్లో ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శ్రీనివాస్ సాయి ఈ వారం ఓటింగ్ లో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సంజన 9.58 శాతం, రాము రాథోడ్ 7.02 శాతం ఓటింగ్ తో అయిదారు ప్లేస్ ల్లో ఉన్నారు. శ్రీనివాస్ సాయి 4.39 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


