బిగ్ బాస్ 9 తెలుగు: నువ్వూ నీ ఓవరాక్షన్-లవ్ కంటెంట్ కోసమే వచ్చావ్-రీతుకు ఇచ్చిపడేసిన అయేషా-ఈ వారం నామినేషన్లలో 8 మంది

బిగ్ బాస్ 9 తెలుగు ఏడో వారానికి చేరుకుంది. గత వారం హౌస్ నుంచి అనూహ్యంగా భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రీతు చౌదరీకి అయేషా గట్టిగా ఇచ్చిపడేసింది. 

Published on: Oct 20, 2025, 11:26:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు పోరు ఏడో వారానికి చేరుకుంది. ఆరో వారం హౌస్ నుంచి సీనియర్ నటుడు భరణి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఏడో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్లలో రీతు, అయేషా మధ్య పెద్ద గొడవే జరిగింది.

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్లలో అయేషా, రీతు (youtube/screengrab)
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్లలో అయేషా, రీతు (youtube/screengrab)

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు ఏడో వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారు. రీతు, శ్రీనివాస్, రాము, తనూజ, దివ్య, రమ్య, కల్యాణ్, సంజన నామినేట్ అయ్యారు. వీళ్లలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోనున్నారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగినట్లు తెలిసింది.

టాస్క్ లు పెట్టి

బిగ్ బాస్ హౌస్ లో ఏదీ ఊరికే రాదంటూ ఏడో వారం నామినేషన్ చేయడం కోసం హౌస్ మేట్స్ కు టాస్క్ లు పెడతాడు బిగ్ బాస్. ముందుగా ఇమ్మాన్యుయేల్, అయేషా బెలూన్ టాస్క్ ఆడతారు. ఇందులో వారికి నామినేషన్ పవర్ టికెట్స్ దొరుకుతాయి. ఆ తర్వాత అయేషా నేరుగా రీతు చౌదరీని నామినేట్ చేస్తుంది. ముఖానికి ఫోమ్ రాసి నామినేట్ చేస్తుంది. అయేషా తన పాయింట్ చెప్పబోతుంటే ఆగు ఫోమ్ తీసి మాట్లాడతానని రీతు అంటుంది.

లవ్ కంటెంట్ కోసం

రీతుపై అయేషా రెచ్చిపోతుంది. ‘‘నువ్వు, నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది అయేషా. ‘‘నేను చెప్పానా లవ్ చేస్తున్నాను, లవ్ చేసుకుని తిరుగుతున్నాను’’ అని రీతు కౌంటర్ ఇస్తుంది. ‘‘ఎందుకంత యాటిబ్యూడే నీకు, నీ యారగన్సీ, గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు’’ అని అయేషా ఇచ్చిపడేస్తుంది.

రివర్స్ లో

రివర్స్ లో రీతు కూడా అయేషాను నామినేట్ చేస్తుంది. అయేషాను దివ్య కూడా నామినేట్ చేస్తుంది. రమ్య, సంజనను తనూజ.. కల్యాణ్ ను శ్రీనివాస్.. శ్రీనివాస్, సంజనను కల్యాణ్.. తనూజ, దివ్యను సంజన నామినేట్ చేస్తారు. నామినేషన్లలోకి రీతు, శ్రీనివాస్, రాము, తనూజ, దివ్య, రమ్య, కల్యాణ్, సంజన, అయేషా వస్తారు. అయితే బిగ్ బాస్ కెప్టెన్ గౌరవ్ కు పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమంటాడు. అతను అయేషాను సేవ్ చేస్తాడు. దీంతో చివరకు 8 మంది నామినేషన్లలో ఉంటారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More