అదిరిపోయిన ధనుష్, కృతి సనన్ కెమిస్ట్రీ- తేరే ఇష్క్ మే సినిమాకు తొలి రోజు 16 కోట్ల కలెక్షన్స్- ఆ స్టార్ హీరోలను ఓడించి!
తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. రాంజానా, ఆంత్రంగి వంటి సూపర్ హిట్స్ తర్వాత ధనుష్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. మరి తేరే ఇష్క్ మే తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్ల రోజు 1: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తేరే మేరే ఇష్క్ ట్రైలర్ అభిమానులలో ఆసక్తి రేకెత్తించింది.

ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్
తేరే మేరే ఇష్క్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. లవ్ మ్యూజికల్ హిట్ మూవీస్ అయిన రాంజనా, ఆత్రంగి రే తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. భారీ అంచనాల నడుమ నవంబర్ 28న థియేటర్లలో తేరే మేర్ ఇష్క్ మూవీ విడుదలైంది.
పాజిటివ్ రివ్యూస్
తేరే మేరే ఇష్క్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్, కృతి సనన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. మంచి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తేరే ఇష్క్ మే పేరు తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మే తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
తేరే ఇష్క్ మే తొలి రోజు కలెక్షన్స్
ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం తేరే ఇష్క్ మే సినిమాకు ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 16.50 కోట్లుగా ఉన్నాయి. అంటే, ఇండియాలో తొలి రోజున తేరే ఇష్క్ మే రూ. 16.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ ఏడాది వచ్చిన రొమాంటిక్ సినిమాలు మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయి.
సయ్యారా తర్వాత
భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రొమాంటిక్ డ్రామా మూవీ సయ్యారా తొలి రోజు ఇండియాలో రూ. 21.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రొమాంటిక్ చిత్రాల్లో ఈ మూవీనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా రికార్డ్ ఉంది. కానీ, తేరే ఇష్క్ మే ఇతర స్టార్ హీరోల సినిమాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది.
స్టార్ హీరోల సినిమాలు బ్రేక్
కన్నప్ప నటుడు, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, హర్షద్ వార్సీ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమా తొలి రోజు రూ. 12 కోట్లు వసూలు చేసింది. అలాగే, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రూ. 10.70 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఓడించి ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ధనుష్ తేరే ఇష్క్ మే నిలిచింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


