ఓటీటీలో ఇవాళ వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్- బ్యూటిపుల్ లేడి రోబోతో రొమాన్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగు సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఏఐ లవ్ స్టోరీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు కథ, స్కీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాతగా వ్యవహరించారు. బ్యూటిఫుల్ రోబోతో రొమాన్స్ చేసే కథగా వచ్చిన ఏఐ లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో తెలుగు కంటెంట్ రోజు రోజుకీ బాగా విస్తరిస్తోంది. హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు ఎన్నో రకాల జోనర్లలో తెలుగు ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ప్రతి ఆదివారం సరికొత్త కథతో ఓటీటీ సినిమాను రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ స్టైల్‌లో
అందులో భాగంగానే ఇవాళ (నవంబర్ 23) ఆదివారం న్యూ కాన్సెప్ట్‌తో ఓ తెలుగు మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇప్పటివరకు ఇలా రొమాన్స్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో సినిమాలు వచ్చాయి. కానీ, ఈసారి హాలీవుడ్ స్టైల్‌లో సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది.
మరో అమ్మాయితో రొమాన్స్
ఆ సినిమానే ఏఐ లవ్ స్టోరీ. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఏఐ లవ్ స్టోరీ సినిమా తెరకెక్కింది. హీరోను, హీరోయిన్ లవ్ చేస్తుంది. కానీ, హీరో మాత్రం మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ, లవ్ ట్రాక్ నడుపుతుంటాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని దూరం చేసి హీరోను దక్కించుకోవాలనుకుంటుంది హీరోయిన్.
ఎవరా బ్యూటిపుల్ గర్ల్
మరి అందుకు హీరోయిన్ ఏం చేసింది?, ఎలాంటి ప్లాన్స్ వేసింది?, మరి హీరోను దక్కించుకుందా? హీరో రొమాన్స్ చేస్తున్న బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ ఏఐ లవ్ స్టోరీ చూడాల్సిందే. అయితే, హీరో రొమాన్స్ చేసే అమ్మాయి లేడి రోబో అని తెలుస్తోంది. టైటిల్‌లోనే దాదాపుగా కథను చెప్పేశారు.
రాఘవేంద్ర రావు బాధ్యతలు
హీరో, హీరోయిన్ మధ్య రోబోతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను మలిచారు. ఈ ఏఐ లవ్ స్టోరీ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణతోపాటు నిర్మతగా వ్యవహరించారు. దర్శకత్వంతోపాటు డైలాగ్స్‌ను సుధీర్ కుమార్ అందించారు. సకి, రావు పీ శెట్టి రచన చేశారు.
అరగంట రన్ టైమ్‌తో
రఘు వట్టెల సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా రాఘవేంద్ర వర్మ బాధ్యతలు నిర్వర్తించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కోవెలమూడు మాధవి, లైన్ ప్రొడ్యూసర్‌గా భాస్కర్ పోకల ఉన్నారు. ఇక ఏఐ లవ్ స్టోరీ సినిమా రన్ టైమ్ కేవలం 31 నిమిషాల 52 సెకన్స్ మాత్రమే ఉంది. అంటే కేవలం అరగంట మాత్రమే.
ఈటీవీ విన్ ఓటీటీలో
ఇకపోతే ఈటీవీ విన్‌లో నేటి నుంచి ఏఐ లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి వారం అతి తక్కువ నిడివితో సినిమాలు అందించే వీక్లీ సిరీస్ కథా సుధాలో భాగంగా ఈటీవీ విన్‌లో ఏఐ లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ అయింది. కాబట్టి, తెలుగులో తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈటీవీ విన్‌లో ఈ ఏఐ లవ్ స్టోరీపై లుక్కేయండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


