శివాజీ సవాల్ విసురుతున్నారు- డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్- ఆయనకు చాలా దమ్ము, ధైర్యం ఉందంటూ!

ఇటీవల దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ మాట్లాడిన మాటలు దుమారం రేపడం, వాటిపై క్షమాపణ ఆయన కోరడం జరిగింది. అయితే, అదే ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి శివాజీ, దండోరా డైరెక్టర్ గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Updated on: Dec 24, 2025, 12:14:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్, సింగర్ చిన్మయి, అనసూయ భరద్వాజ్ తమదైన శైలీలో స్పందించారు. అనంతరం తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు శివాజీ.

శివాజీ సవాల్ విసురుతున్నారు- డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్- ఆయనకు చాలా దమ్ము, ధైర్యం ఉందంటూ!
శివాజీ సవాల్ విసురుతున్నారు- డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్- ఆయనకు చాలా దమ్ము, ధైర్యం ఉందంటూ!

అనిల్ రావిపూడి కామెంట్స్

అయితే, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. అదే ఈవెంట్‌లో హీరో శివాజీ, దర్శకుడు మురళీకాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు అనిల్ రావిపూడి. దాంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టేస్ట్ ఉన్న సినిమాలే నిర్మిస్తారు

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "‘దండోరా’ నిర్మాత బెన్నీ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ టేస్ట్ ఉన్న చిత్రాల్నే నిర్మిస్తుంటారు. మళ్లీ డిసెంబర్ 25న ఈ ‘దండోరా’తో ఆయనకు విజయం దక్కాలి" అని ఆశించారు.

నేషనల్ అవార్డ్ దక్కాలి

"‘దండోరా’ టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ టైటిల్ పాటను రాసిన కాసర్ల శ్యామ్‌కి నేషనల్ అవార్డు దక్కాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు నటించారు. ‘దండోరా’ టీంకు నేను ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నాను. టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు ‘దండోరా’ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది" అని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు.

చాలా దమ్ము, ధైర్యం ఉంది

"సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి. డైరెక్టర్ మురళీకాంత్ గారికి చాలా దమ్ము, ధైర్యం ఉంది. బిందు మాధవి చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటోంది. ‘గౌతమ్ ఎస్ఎస్‌సి’ చిత్రానికి అప్రెంటిస్‌గా పని చేశాను. నవదీప్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, నటుడిగా ఎంతో సక్సెస్ అయ్యాడు. నవదీప్ మరిన్ని అద్భుతమైన పాత్రల్ని పోషించాలని కోరుకుంటున్నాను" అని అనిల్ రావిపూడి తెలిపారు.

సవాల్ విసురుతున్నారు

"నా సినిమాలు సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్లకంటే శివన్న ఎక్కువగా సంతోషిస్తుంటారు. తన కోసం, తనకంటూ కొత్త పాత్రల్ని రాయాలనే సవాల్‌ను రాబోయే దర్శకులకి శివాజీ గారు విసురుతున్నారు. డిసెంబర్ 25న రాబోతోన్న ‘దండోరా’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని శివాజీ గురించి చెప్పారు అనిల్ రావిపూడి.

కంటెంట్ ఉంటేనే

"ప్రమోషన్ చేస్తే సినిమాపై అటెన్షన్ పెరుగుతుంది. కంటెంట్ ఉంటేనే సినిమాను జనాలు ఆదరిస్తారు, చూస్తారు. గత కొన్ని నెలల నుంచి చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. డిసెంబర్ 25న కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ‘దండోరా’కి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్" అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More