మన వాళ్ల గురించి మనమే తక్కువగా చూస్తాం, 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. తెలుగు డైరెక్టర్లపై బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

బిగ్ బాస్ శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సామాజిక అసమానతలపై తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న థియేటర్లలో దండోరా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Dec 20, 2025, 19:55:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు.

మన వాళ్ల గురించి మనమే తక్కువగా చూస్తాం, 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. తెలుగు డైరెక్టర్లపై బిగ్ బాస్ శివాజీ కామెంట్స్
మన వాళ్ల గురించి మనమే తక్కువగా చూస్తాం, 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా.. తెలుగు డైరెక్టర్లపై బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

దండోరా నటీనటులు

ఈ చిత్రంలో బిగ్ బాస్ శివాజీతో పాటుగా న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. దండోరా సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

హీరో శివాజీ కామెంట్స్

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘వేదం’, ‘కంచెరపాలెం’ చిత్రంలోనూ వేశ్య పాత్రల్ని చూపించారు. ఇందులో ఎలా చూపించబోతోన్నారు?

-‘దండోరా’ చిత్రంలో బిందు మాధవి గారి పాత్రను చాలా క్లాసీగా చూపించారు. ప్రతీ ఒక్కరూ సినిమాతో, పాత్రలతో కనెక్ట్ అవుతారు.

మిమ్మల్ని కొత్త దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నట్టుగా ఉన్నారు?

-నేను దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఎంతో పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులే.

-ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. ఇదే శివాజీ 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ, మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో.

‘మిస్సమ్మ’లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేశారా? ‘కోర్ట్’, ‘డండోరా’ లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేస్తారా?

-‘మిస్సమ్మ’, ‘శైలజా కృష్ణమూర్తి’, ‘అదిరిందయ్య చంద్రం’ ఇలా అన్ని రకాల చిత్రాల్ని ఎంజాయ్ చేశాను. అయితే నటుడిగా నా మీద నాకు నమ్మకం ఉండేది. కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించగలను. ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందేమో. అలా అని ప్రస్తుతం అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు.

‘దండోరా’ తరువాత మీ నుంచి రాబోతోన్న చిత్రాల గురించి చెప్పండి?

-‘దండోరా’ తరువాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More