ఎవరు చేయకూడని పెద్ద తప్పు చేశావ్, అబద్ధం చెప్పమన్న చెప్పను.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి!

బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈపాటికే శనివారం నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. ఇందులో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టిగా సాగింది. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Dec 14, 2025, 18:05:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ అంటే ఊహించని ఎలిమినేషన్స్, అనుకోని టాస్క్‌లు, సపోర్టింగ్‌లు, గొడవలు, రొమాన్స్‌. ఈ వారం కూడా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకోనుంది. ఈపాటికే శనివారం అంటే డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు.

ఎవరు చేయకూడని పెద్ద తప్పు చేశావ్, అబద్ధం చెప్పమన్న చెప్పను.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి!
ఎవరు చేయకూడని పెద్ద తప్పు చేశావ్, అబద్ధం చెప్పమన్న చెప్పను.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి!

శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి

ఎలిమినేషన్ అనంతరం హీరో శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. ఈ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి అన్నట్లుగా ఒకరికొకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ముందుగా సుమన్ శెట్టి ఇంటర్వ్యూలోకి హాజరయ్యాడు. రాగానే సుమన్ శెట్టితో ప్రమాణం చేయించాడు హోస్ట్ శివాజీ.

అబద్ధం చెప్పను

"అధ్యక్షా.. బజ్‌లో ఏ క్వశ్చన్ అడిగినా.. భరణి గారి నుంచి ఏ లైఫ్‌లైన్ తీసుకోనని.. అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను" అని శివాజీ ప్రమాణం చేయిస్తుంటే అంతా చెప్పిన సుమన్ శెట్టి చివరిలో మాత్రం "అబద్ధం చెప్పమన్న చెప్పను" అని పంచ్ ఇచ్చాడు. దానికి అదోలా చూశాడు శివాజీ.

ఇప్పుడెందుకు అవన్నీ

తర్వాత సుమన్ శెట్టిని కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగాడు శివాజీ. "లోపల కల్యాణ్‌కు, ఇమ్ముకు బ్యాండేజ్ తీసుకెళ్తానని మాటిచ్చావంట కదా" అని శివాజీ అడిగితే.. "అన్న వదిలేయన్న.. ఇప్పుడెందుకున్న అవన్నీ" అని సుమన్ శెట్టి నవ్వుతూ అన్నాడు. "గుర్తు చేసుకుంటే తప్పా ఏంటీ" అని శివాజీ కూడా నవ్వుతూ అన్నాడు.

సుమన్ శెట్టి నిజాయితీ

"అసలు ఈ హౌజ్‌లో ఇన్నిరోజులు ఉంటానని అనుకున్నావా" అని శివాజీ అడిగితే.. "లేదన్నా" అని నిజాయితీగా చెప్పాడు సుమన్ శెట్టి. "మేము కూడా అనుకోలేదు" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. "మేము కామెడీ ఎక్స్‌పెక్ట్ చేశాము. "అసలు సంజన గారి పేరు చెబితే ఫేస్ మొత్తం మారిపోయేది తెలుసా.. అదిగో.. అదిగో" అని అన్నాడు హీరో శివాజీ.

రంగులు మార్చే ఊసరవెల్లి

"కానీ, ఓ మాటన్నావ్ సుమన్. వస్తుందయ్యా రంగులు మార్చే ఊసరవెల్లి. ఎందుకు నీ పిలక ఆయన (భరణి శంకర్) చేతులో పెట్టావ్. నీకెందుకు ఆయనతోటి. నీ ఐడియా నీకు ఉండదా" అని వరుసగా ప్రశ్నించాడు శివాజీ. దానికి సుమన్ శెట్టి ఏదో చెప్పినట్లుగా ప్రోమోలో చూపించారు.

చేయకూడని తప్పు చేశావ్

"కానీ, చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్. ఎవరు చేయకూడని తప్పు చేశావ్ బిగ్ బాస్ హౌజ్‌లో. ఎందుకు చేశావ్ అలా" అని శివాజీ సీరియస్‌గా అడిగాడు. "ఆ తప్పేంటో చెబితే చెబుతానన్న" అని సుమన్ శెట్టి అన్నాడు. "బాత్రూమ్ దగ్గర" అని హింట్ ఇచ్చాడు శివాజీ.

ఆలోచించుకోవా

సుమన్ శెట్టి ఆలోచనలో పడ్డాడు. "ఏం ఆలోచించుకోవా ఏమి. ఇంటి దగ్గర కూడా ఇలాగే చేస్తావా" అని వరుసగా అన్నాడు శివాజీ. దానికి సుమన్ శెట్టి మౌనంగా ఉండిపోయాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More