కల్యాణ్ నుంచి డిమాన్‌కు షిఫ్ట్ అయ్యావా.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నలు.. బిత్తరపోయిన రీతూ చౌదరి

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం జబర్దస్త్ బ్యూటీ, యాంకర్ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది రీతూ చౌదరి. అయితే, హోస్ట్ శివాజీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బిత్తరపోయింది రీతూ చౌదరి. శివాజీ రీతూ చౌదరిల బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Dec 8, 2025, 13:16:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు పదమూడో వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. గ్లామర్, ఆటతో అలరించిన జబర్దస్త్ బ్యూటీ, యాంకర్ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ అనంతరం కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారని తెలిసిందే.

కల్యాణ్ నుంచి డిమాన్‌కు షిఫ్ట్ అయ్యావా.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నలు.. బిత్తరపోయిన రీతూ చౌదరి
కల్యాణ్ నుంచి డిమాన్‌కు షిఫ్ట్ అయ్యావా.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నలు.. బిత్తరపోయిన రీతూ చౌదరి

శివాజీ హోస్ట్‌గా

ఈ క్రమంలో హీరో శివాజీ హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది రీతూ చౌదరి. రీతూ రాగానే "నీకు ఒక నిజం చెబుతాను. నువ్ మ్యాగ్జిమమ్ ఎప్పుడు ఏడ్చావో అప్పుడు కన్నీళ్లు రాలేదు అమ్మాయి" అని శివాజీ అన్నాడు. దానికి "ఇంకిపోయాయి మరి ఏడ్చి ఏడ్చి" అని రీతూ చెప్పింది.

"ఓరి బాబో.." అంటూ హేళన చేశాడు శివాజీ. దానికి హౌజ్‌లో నవ్వినట్లుగానే రీతూ నవ్వింది. "రీతూ గేమ్ మీద ఫోకస్ చేయడం కన్నా డిమాన్ మీద ఫోకస్ చేయడం వల్ల రీతూ ఎందుకో వెనుకపడింది.. సారీ డిమాన్ వెంటపడింది" అని శివాజీ అన్నాడు. దానికి షాక్ అయి చూసింది రీతూ చౌదరి.

స్ట్రాటజికల్‌గా ఏడిస్తే

"ఇదంతా ఎలా ఉందంటే అమ్మా.. స్ట్రాటజికల్‌గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు. వాన్ని తిడతావు.. వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్లి ఓ మూలన కూర్చుంటావు" ఇదంతా కెమెరా అటెన్షన్‌లా అనిపిస్తుంది" అని శివాజీ అన్నాడు.

"కనెక్ట్ అయ్యాడు వాడు జెన్యూన్‌గా. వాడు గెలవాలి. బాగా ఆడాలి" అని రీతూ చెబుతుంటే "ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు" శివాజీ హుషారుగా అన్నాడు. దాంతో బిత్తరపోయి చూసింది రీతూ చౌదరి.

రెండు వారాలు కల్యాణ్‌తో

"కల్యాణ్ నాకు" మంచి ఫ్రెండ్ అని రీతూ చౌదరి చెప్పబోతుంటే.. "అవును ఫస్ట్ రెండు వారాలు కల్యాణ్‌తోనే ఉన్నావ్ ఆ తర్వాత డిమాన్‌కు షిఫ్ట్ అయ్యావని అంటున్నారు" అని శివాజీ అన్నాడు. దానికి షాక్ అయి చూసింది రీతూ. "ఒక అమ్మాయి, అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారు" అని రీతూ అంటుంటే.. "కొంచెం కాదు.. ఒక రెండు మూడు వారాలు అయితే వీళ్లిద్దరిని తీసి బయటేయాలి అనే కామెంట్సే ఎక్కువ ఉండేవి" అని శివాజీ చెప్పాడు.

"నీ క్యారెక్టర్ మీద అంత ముద్ర వేసినప్పుడు నువ్వు అలాగే ఉంటావా" అని శివాజీ అడిగాడు. "నేను కేవలం నాలా ఉండాలని అనుకున్నాను. రీతూ చౌదరి అంటే ఏంటో నాలా ఉండాలనుకున్నా" అని రీతూ చెప్పింది. "మూడు వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా. త్యాగం అయిపోద్దా" అని శివాజీ నిలదీశాడు.

అంత కనెక్షన్ లేదు

"నాకు ప్రేమ వచ్చి" అని రీతూ చెబుతుంటే "డిమాన్ బయటకుపోతున్నాడంటే నువ్వు సాక్రిఫైజ్ చేశావంటే అర్థం చేసుకుంటాం" అని శివాజీ అన్నాడు. దానికి ఏం చెప్పాలో తెలియగా చిరాకుగా చూస్తూ ఉండిపోయింది రీతూ చౌదరి. తర్వాత సుమన్ శెట్టితో అంత కనెక్షన్ లేదన్న రీతూ చౌదరి అతని ఫొటోను బ్రేక్ చేసింది.

"బయటకు వచ్చాకా డిమాన్‌తో అదే రిలేషన్ కంటిన్యూ అవుద్దా" అని శివాజీ ప్రశ్నించాడు. దానికి మరింత బిత్తరపోయి చూసింది జబర్దస్త్ రీతూ చౌదరి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More