ఆయన ఎత్తుకుని తిరుగుతాడు నీకెంటమ్మా ప్రాబ్లమ్.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నలు.. ఏడ్చేసిన దివ్య నిఖిత
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నుంచి పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య నిఖితను భరణి శంకర్‌కు సంబంధించిన ప్రశ్నలను అడిగాడు హీరో శివాజీ. ఈ క్రమంలోనే దివ్య నిఖి ఏడ్చేసింది. అతనికి ఎప్పటికీ వెల్ విషర్‌గా ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్‌తో ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా హీరో శివాజీ వ్యవహరిస్తున్నాడు.

మనకేంటమ్మ అసలు
అయితే, ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది పన్నెండో వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ దివ్య నిఖిత. బిగ్ బాస్ బజ్‌కు దివ్య నిఖిత రాగానే హోస్ట్ శివాజీ వెల్‌కమ్ చెప్పాడు. "దివ్య నిఖిత లాంటి ఒక స్ట్రాంగ్ మనిషి.. ఇన్ని సీజన్స్ చూసినప్పుడు భరణి ఎందుకు. తనూజతో ఎలా ఉంటే మనకేంటమ్మ అసలు.." అని శివాజీ అడిగాడు.
కానీ తెలిసిపోతుందిగా
"అది నాకు ఎప్పుడు ముందు" అని దివ్య చెబుతుండగానే.. మధ్యలో "కానీ మీ పొసెసివ్‌నెస్ తెలిసిపోతుంది తల్లి" అని శివాజీ అన్నాడు. దానికి దివ్య నవ్వింది. "ఇప్పుడు నీ ఒపినీయన్ ఏంటమ్మా తనూజ మీద" అని హీరో శివాజీ అడిగాడు. "నాకేం అవసరం సర్ వాళ్లను విడగొట్టాడానికి. వాళ్లను విడగొట్టి నేను ఏం సాధిస్తాను. పోని. నేను వచ్చానని చెప్పి విడిపోడానికి వాళ్లిద్దరు అంత వీకా" అని దివ్య నిఖిత అంది.
చిన్న పిల్లాడు కాదుగా
"ఆయన ఏం రాస్తే మనకేంటమ్మా ఇది.. ఆయన ఆయింట్‌మెంట్ రాశాడు.. ఆయన ఎత్తుకుని తిరుగుతాడు. అతనేం చిన్న పిల్లాడు కాదు. నీకేంటమ్మా ప్రాబ్లము.." అని శివాజీ ప్రశ్నించాడు. "నాకు వచ్చి ఒకరు ఈ పెయిన్ ఉందని చెప్పారనుకోండి" దివ్య అంటే.. భరణి చెప్పకుండానే మీకు పెయిన్ తెలుస్తుందిగా అది కదా మా బాధ" అని శివాజీ పంచ్ ఇచ్చాడు.
అప్పుడైన అర్థం చేసుకోవాలిగా
"బయటి నుంచి వచ్చాకా ఆయన నిన్ను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. గమనించావా" అని శివాజీ అంటే.. గమనించానని దివ్య చెప్పింది. "మరి అప్పుడైన అర్థం చేసుకోవాలి కదమ్మా" అని శివాజీ అన్నాడు.
మీ మమ్మీ ఏం చెప్పిందంటే
"మీ మమ్మీ మాధురి గారికి ఏం చెప్పాడో తెలుసా. దివ్యాని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పమ్మా ప్లీజ్" అని శివాజీ చెప్పాడు. దాంతో ఎమోషనల్ అయింది దివ్య నిఖిత.
కన్నీళ్లు పెట్టుకున్న దివ్య
"నా అన్నయ్య వెనకొచ్చారు. ఆయనతో ఉండాలి. బాగా చూసుకోవాలి. ఆయనతో గేమ్ బాగా ఆడాలి. ఇదే ఇంటెన్షన్‌తో ఉన్నాను. బయటకు వెళ్లిన తర్వాత కూడా ఆయన నాతో ఎలా ఉంటారో తెలియదు కానీ నేను 100 శాతం ఆయన వెల్ విషర్‌గానే ఉంటాను" అని కన్నీళ్లు పెట్టుకుంది దివ్య నిఖిత.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


