బిగ్ బాస్ నుంచి దివ్య నిఖిత ఎలిమినేట్- రూలింగ్‌లా మారిన చెల్లెలి బాండింగ్- 9 వారాల్లో ఎంత సంపాదించిదంటే?

బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న దివ్య నిఖిత బిగ్ బాస్ హౌజ్‌లో 9 వారాలు ఉంది. మరి ఈ 9 వారాల్లో బిగ్ బాస్ ద్వారా దివ్య నిఖిత ఎంత సంపాదించిందో లుక్కేద్దాం.

Published on: Dec 1, 2025, 12:45:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మహా అయితే మరో రెండు, మూడు వారాలు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కొనసాగనుంది. అంటే మరో రెండు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, గత వారం నో ఎలిమినేషన్ కారణంగా ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటికి వెళ్లలేదు.

బిగ్ బాస్ నుంచి దివ్య నిఖిత ఎలిమినేట్- రూలింగ్‌లా మారిన చెల్లెలి బాండింగ్- 9 వారాల్లో ఎంత సంపాదించిదంటే?
బిగ్ బాస్ నుంచి దివ్య నిఖిత ఎలిమినేట్- రూలింగ్‌లా మారిన చెల్లెలి బాండింగ్- 9 వారాల్లో ఎంత సంపాదించిదంటే?

దివ్య నిఖిత ఎలిమినేట్

కానీ, ఈ వారం ఎలిమినేషన్ చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. గత వారమే ఎలిమినేట్ కావాల్సిన దివ్వ సీరియల్ హీరోయిన్ తనూజ గౌడతో గొడవ కారణంగా సేఫ్ అయింది. కానీ, ఈ వారం మాత్రం దివ్యను ఆడియెన్స్ ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్ ఓటింగ్

బిగ్ బాస్ 9 తెలుగు పన్నెండో వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వీరికి నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1, 2 స్థానాల్లో కల్యాణ్, తనూజ ప్లేసులు మారుతూ కొనసాగుతూ వచ్చారు. తర్వాత మూడో స్థానంలో ఇమ్మాన్యూయేల్, నాలుగో ప్లేసులో డిమాన్ పవన్, ఐదో స్థానంలో భరణి శంకర్, ఆరో ప్లేసులో సంజన ఉన్నారు.

మారిపోయిన గేమ్

అలాగే, ఏడో స్థానంలో కమెడియిన్ సుమన్ శెట్టి ఉండగా.. చివరి 8వ ప్లేసులో ఆఖరున దివ్య నిఖిత ఉంది. దాంతో దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. సెప్టెంబర్ 25న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా దివ్య నిఖిత హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీతో మిగతా కంటెస్టెంట్స్ గేమ్ మారిపోయింది.

రూలింగ్‌లా దివ్య బాండింగ్

మొదటి రెండు వారాల పాటు దివ్య నిఖిత గేమ్, అనాలిసిస్, స్ట్రాటజీస్, బాండింగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. దివ్యకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత దివ్య ప్రవర్తన మారుతూ వచ్చింది. ముఖ్యంగా భరణి శంకర్ విషయంలో చెల్లిగా ఉన్న దివ్య బాండింగ్ రూలింగ్‌లా మారిపోయింది.

భరణి శంకర్‌పై పెత్తనం

వయసులో పెద్ద అని తెలిసిన కూడా భరణి శంకర్‌పై పెత్తనం చూపించడం, తనూజతో భరణి క్లోజ్‌గా ఉంటే కోప్పడటం, తనూజపై గ్రడ్జ్ పెంచుకోవడం వంటివి చాలా చేసిందని రివ్యూవర్స్ చెప్పేవారు. ఇలా నెగెటివిటీ మూటగట్టుకుని ఫైనల్‌గా ఎలిమినేషన్‌కు గురి అయింది దివ్య నిఖిత.

దివ్య నిఖిత రెమ్యూనరేషన్

20 ఏళ్ల వయసున్న దివ్య నిఖితకు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 1.5 లక్ష రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9 వారాల పాటు ఉన్న దివ్య నిఖిత బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా రూ. 13.5 నుంచి రూ. 14 లక్షల వరకు సంపాదించి ఉండొచ్చని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More