బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్- 2 రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే?

బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆటతో మంచి క్రేజ్, డిమాన్ పవన్ ఫ్రెండ్షిప్‌తో నెగెటివిటీ అందుకున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. అయితే, రీతూ చౌదరి రెమ్యూనరేన్ రెండు రకాలుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో 13 వారాల్లో రీతూ ఎంత సంపాదించిందో లెక్కేద్దాం.

Published on: Dec 7, 2025, 07:54:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఊహించని ఎలిమినేషన్స్, షాకింగ్ ట్విస్ట్స్, పార్శాలిటీగా చూడటం వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కూడా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది.

బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్- 2 రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే?
బిగ్ బాస్ నుంచి ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్- 2 రకాలుగా రెమ్యూనరేషన్- 13 వారాల్లో జబర్దస్త్ బ్యూటీ ఎంత సంపాదించంటే?

డబుల్ ఎలిమినేషన్ కూడా

నిన్నటి (డిసెంబర్ 6) మధ్యాహ్నాం వరకు కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని తెగ ప్రచారం జరిగింది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని ఇన్‌సైడ్ నుంచి టాక్ వస్తున్నట్లుగా లీక్స్ వచ్చాయి. కానీ, అనూహ్యంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది.

ఇవాళ రీతూ చౌదరి ఎలిమినేట్

అలాగే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇక రీతూ చౌదరి ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ (డిసెంబర్ 7) స్టార్ మా ఛానెల్‌, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించిన షూటింగ్ మాత్రమే నిన్న (డిసెంబర్ 6) సాయంత్రం పూర్తయిపోయింది.

ఈ వారం నామినేషన్స్

కాగా బిగ్ బాస్ తెలుగు 9 పదమూడో వారం తనూజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, డిమాన్ పవన్, రీతూ చౌదరి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తనూజ, డిమాన్ సేఫ్ జోన్‌లో ఉండగా భరణి, సుమన్, సంజన, రీతూ నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాలు కాస్తా అటు ఇటుగా ఉంటూ వచ్చాయి.

ఆ ఇద్దరికి బదులుగా

అయితే, ఎక్కువగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడని, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన హౌజ్‌ను వీడే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. కానీ, ఈ ఇద్దరికి బదులుగా రీతూ చౌదరి ఎలిమినేషన్ అందరిని షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రీతూ చౌదరికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

రోజుకు రూ. 40 వేల రెమ్యూనరేషన్

అది కూడా రెండు రకాలుగా రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రీతూ చౌదరికి రోజుకు రూ. 40 వేల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అలాగే, వారానికి రూ. 2.75 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఒక టాక్ నడుస్తోంటే.. రూ. 3.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు మరో న్యూస్ వినిపిస్తోంది.

13 వారాల సంపాదన

ఈ లెక్కల ప్రకారం 13 వారాలు బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లో ఉన్న రీతూ చౌదరి ఈ షో ద్వారా రూ. 35.75 లక్షల నుంచి రూ. 45.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇలా అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోనే అందరికంటే అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా రీతూ చౌదరి నిలుస్తుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More