ఎంట్రీతోనే హిస్టరీ-బిగ్ బాస్‌లో ఆర్మీ జవాన్ పవర్-ఫస్ట్ ఫైనలిస్ట్ కల్యాణ్ గురించి ఈ విషయాలు తెలుసా?
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పడాల కల్యాణ్ సత్తాచాటాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఆర్మీ జవాన్ పవర్ తో అదరగొట్టాడు. మరి కల్యాణ్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని వివరాలపై ఓ లుక్కేయండి.
పడాల కల్యాణ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన పేరు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ ఆర్మీ జవాన్ బిగ్ బాస్ లో తన పవర్ చూపించి ఫైనల్ బెర్త్ పట్టేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను దాటి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. మరి కల్యాణ్ ఎవరు? అతని గురించిన విషయాలు ఇక్కడ చూద్దాం.

అగ్ని పరీక్షలో నెగ్గి
ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి కామనర్లను కూడా పంపించారు. ఇందు కోసం అగ్ని పరీక్ష అనే పోటీ పెట్టి మరీ సెలక్ట్ చేశారు. ఇందులో ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ అదరగొట్టాడు. ఆటతో, మాటతో సత్తాచాటి బిగ్ బాస్ 9 తెలుగు ఎంట్రీ టికెట్ కొట్టేశాడు. ఈ సీజన్ లో తొలి కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టాడు.
ఎంట్రీతోనే హిస్టరీ
బిగ్ బాస్ లోకి ఎంట్రీతోనే పడాల కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 9 సీజన్ల బిగ్ బాస్ చరిత్రలో హౌస్ లోకి అడుగుపెట్టిన ఆర్మీకి చెందిన తొలి వ్యక్తిగా పవన్ నిలిచాడు. గత 8 సీజన్లలో ఆర్మీకి చెందిన జవాన్ ఎవరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదు. ఎంట్రీతోనే అదరగొట్టిన కల్యాణ్ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.
మన తెలుగబ్బాయి
పడాల కల్యాణ్ మన తెలుగబ్బాయే. అతనిది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం. అక్కడే పుట్టిన కల్యాణ్ హైస్కూల్ వరకూ విజయనగరంలోనే చదివాడు. పై చదువుల కోసం వేరే చోటుకు వెళ్లాడు. అక్కడి నుంచి ఆర్మీ దిశగా అతని అడుగులు పడ్డాయి. దేశ సేవ చేయాలనే సంకల్పంతో సైన్యంలో చేరాడు. మూడు సంవత్సరాలుగా జవాన్ గా సైన్యంలో పనిచేస్తున్నాడు. అతణ్ని జవాన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అని కూడా పిలుస్తుంటారు.
సినిమాలపై ప్రేమ
ఆర్మీలో జవాన్ గా పని చేస్తున్న కల్యాణ్ కు సినిమాలపై ప్రేమ ఉంది. అందుకే తనను తాను పరిచయం చేసుకోవడానికి, తన సత్తా చాటడానికి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం కల్యాణ్ తన ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే సినిమా ఛాన్స్ లు వచ్చి, బిజీ అయితే మాత్రం జాబ్ వదిలేస్తానని గతంలో చెప్పాడు కల్యాణ్.
టైటిల్ రేసులో
క్రమశిక్షణ, పవర్, సంకల్పంతో సాగుతున్న పడాల కల్యాణ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ టైటిల్ రేసులో ఉన్నాడు. ఇప్పటికే ఫైనల్ టికెట్ పట్టేశాడు. ఇక మిగిలింది టైటిల్ కొట్టడమే. ఈ టైటిల్ రేసు తనూజ వర్సెస్ కల్యాణ్ అని సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి సెలబ్రిటీలను వెనక్కి నెట్టి కల్యాణ్ టైటిల్ తో హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


