కల్యాణ్‌పైకి దూసుకెళ్లిన భరణి- బిగ్ బాస్ 9 ఓటింగ్‌లో ట్విస్ట్- డేంజర్ జోన్లోకి హీరోయిన్- ఎలిమినేషన్ ఖాయమా?
ఫినాలేకు చేరవవుతున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్. 13వ వారం ఓటింగ్ ఒక్కసారిగా తారుమారైంది. హీరోయిన్ డేంజర్ జోన్లోకు వచ్చింది. మరోవైపు కల్యాణ్, భరణి మధ్య పెద్ద గొడవ జరిగింది.
బిగ్ బాస్ 9 తెలుగు టికెట్ టు ఫినాలే రేసు హోరాహోరీగా సాగుతోంది. ఫినాలే టికెట్ కోసం కంటెస్టెంట్లు గట్టిగా పోరాడుతున్నారు. ఇంట్లో వాతావరణం వేడిగా మారింది. ఈ క్రమంలో కల్యాణ్, భరణి మధ్య పెద్ద గొడవే జరిగింది. మరోవైపు బిగ్ బాస్ లో ఈ వారం ఓటింగ్ లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.

కల్యాణ్ వర్సెస్ భరణి
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 13వ వారం ఆట సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్లు పోటీ పడతుండటంతో టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ టాస్క్ ల్లో అదరగొడుతున్నారు. ఈ వారం భరణి అగ్రెసివ్ మోడ్ లో ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఓ టాస్క్ లో సంచాలక్ సంజన నిర్ణయాన్ని తప్పుబడుతూ రెచ్చిపోయాడు భరణి. సంజన, రీతుపై గట్టిగట్టిగా అరిచేశాడు. పాత విషయాన్ని కూడా మధ్యలోకి లాగాడు. దీంతో కల్యాణ్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నీ పేరు ఎత్తలేదు అంటూ కల్యాణ్ పైకి దూసుకెళ్లాడు.
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, భరణి, రీతు చౌదరి, సుమన్ శెట్టి, సంజన గల్రానీ నామినేట్ అయ్యారు. ఇందులో ఒకరు లేదా ఇద్దరూ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ బాస్ ఓటింగ్
13వ వారం ఓటింగ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే ఓటింగ్ తారుమారైంది. డేంజర్ జోన్లో ఉన్న భరణి ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు. బదులుగా హీరోయిన్ సంజన గల్రానీ డేంజర్ జోన్లోకు వచ్చింది. ఈ వారం టాస్క్ ల్లో ఆమె గట్టిగానే పోరాడినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇది ఆమె ఓటింగ్ పై ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.
డేంజర్ జోన్లో
ఎప్పటిలాగే ఓటింగ్ లో సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతోంది. ఆమె 28.19 శాతం ఓటింగ్ తో నంబర్ వన్ గా ఉంది. డీమాన్ పవన్ 15.43 శాతం ఓటింగ్ తో రెండో ప్లేస్ లో, భరణి 15.18 శాతం ఓటింగ్ తో మూడో ప్లేస్ లో ఉన్నారు. అయితే మిగతా ముగ్గురు రీతు చౌదరి, సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఓటింగ్ లో ఎక్కువ తేడా ఏం లేదు.
రీతు చౌదరి 13.96 శాతం, సుమన్ శెట్టి 13.94 శాతం, సంజన గల్రానీ 13.3 శాతం ఓటింగ్ తో ఉన్నారు. మారిన ట్రెండ్ ప్రకారం చూస్తే సంజన డేంజర్ జోన్లో ఉంది. ఎలిమినేషన్ కు చాలా దగ్గరగా ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


