నేను విన్న 70, 80 క‌థ‌ల్లో నాకు నచ్చింది ఇదొక‌టి- జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదు: బిగ్ బాస్ శివాజీ

బిగ్ బాస్ ఫేమ్, హీరో శివాజీ నటించిన లేటెస్ట్ సినిమా దండోరా. నవదీప్, నందు, రవికృష్ణ, మౌనిక రెడ్డి, బిందు మాధవి నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దండోరా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Dec 14, 2025, 10:16:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘క‌ల‌ర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ సినిమాల నిర్మాతల నుంచి వస్తోన్న సరికొత్త మూవీ దండోరా. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

నేను విన్న 70, 80 క‌థ‌ల్లో నాకు నచ్చింది ఇదొక‌టి- జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదు: బిగ్ బాస్ శివాజీ
నేను విన్న 70, 80 క‌థ‌ల్లో నాకు నచ్చింది ఇదొక‌టి- జనాలకు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో సినిమా లేదు: బిగ్ బాస్ శివాజీ

దండోరా మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, న‌వ‌దీప్‌, బిందు మాధవి, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 25న దండోరా మూవీ రిలీజ్ కానుండగా తాజాగా డిసెంబర్ 13న టైటిల్ సాంగ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దండోరా టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్, హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి

న‌టుడు శివాజీ మాట్లాడుతూ.. "తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్ట‌ర్‌ గారు స్క్రిప్ట్ చెప్ప‌గానే ఏం చ‌దువుకున్నార‌ని అడిగాను. నేను అమెరికా నుంచి వ‌చ్చానని ఆయ‌న అన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎమోష‌న్స్‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ. జ‌నాల‌కు సందేశాలు, స‌ల‌హాలు ఇచ్చే ప‌రిస్థితిలో ఇవాళ సినిమా లేదు" అని అన్నారు.

"ఈ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్‌, డ్రామా, ఎగ్రెష‌న్ అన్నీ ఉన్నాయి. టైటిల్ విన‌గానే వ‌న్ సైడ్ అయిపోతుందిగా అన్నాను. కానీ అది కాదు.. కామెడీ ఉన్నా అది దండోరా వేసిన‌ట్లే ఉంటుంది. ఎమోష‌న్స్ ఏదైనా దండోరా వేసిన‌ట్లే ఉంటుంది" అని శివాజీ అభిప్రాయపడ్డారు.

"కోర్ట్ క‌న్నా ముందే ఈ సినిమాను నేను క‌మిట్ అయ్యాను. ఫుల్టీ కంటెంట్ లోడెడ్ మూవీ. ఏ లాంగ్వేజ్‌లో వ‌చ్చినా సినిమా ఆడుతుంద‌నేది నా అభిప్రాయం. స్క్రీన్ స్పేస్ అనేది ప‌క్క‌న పెడితే ఇందులో న‌టించిన అంద‌రికీ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌కి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది" అని హీరో శివాజీ పేర్కొన్నారు.

"నేనైతే 90స్ క‌థ వినేట‌ప్పుడు నేనెలాగైతే ఫీల్ అయ్యానో.. ఈ క‌థ విన్న‌ప్పుడు అలాగే అనిపించింది. మంచి క‌థ‌లు, పాత్ర‌లు చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో నేను విన్న 70-80 క‌థ‌ల్లో నాకు న‌చ్చిన క‌థ‌ల్లో ఇదొక‌టి" అని శివాజీ తెలిపారు.

"ఇందులో కులాలు, మ‌తాలు అనే కాన్సెప్ట్ ఉండ‌దు. నాకు తెలిసి ఈ ప్ర‌పంచంలో రెండే కులాలు.. ఒక‌టి డ‌బ్బున్నోడు.. రెండోది డ‌బ్బులేనోడు. ఒక‌డేమో తొక్కాల‌ని, రెండో వాడేమో తొక్కినా లేవాల‌ని చూస్తుంటారు. ఇందులో పాత్ర‌లు కూడా అలాగే ఉంటాయి" అని శివాజీ చెప్పుకొచ్చారు.

"ఇది చాలా మంచి కథ. ఈ సినిమా కథ గురించి దేశం (ఫిల్మ్ ఫెట‌ర్నిటీస్‌) మాట్లాడుతుందేమోన‌నిపిస్తోంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు. డిసెంబ‌ర్ 23 నుంచి ఓవ‌ర్సీస్‌లో దండోరా ప్రీమియ‌ర్స్ ఉంటాయి. అదే రోజున ఇక్క‌డ వేద్దామ‌ని అంటున్నాను. క‌థ‌ను న‌మ్మి చేసిన సినిమా. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం కావాలి. ముర‌ళీగారికి, బెన్నీగారికి, మైత్రీ, ప్రైమ్ షో, అథర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ వారికి థాంక్స్" అని బిగ్ బాస్ శివాజీ తన స్పీచ్ ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More