తమిళ, మలయాళ పరిశ్రమలోకి కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల- నిర్మాత బర్త్ డే స్పెషల్‌గా హైకు ఫస్ట్ లుక్ రిలీజ్

కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవి అపల్ల హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హైకు. ఈ సినిమాతో తమిళం, మలయాళంలో కూడా అడుగు పెడుతోంది శ్రీదేవి. అయితే, డిసెంబర్ 5న నిర్మాత డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా హైకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా హైకును తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది.

Published on: Dec 6, 2025, 11:13:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎమోషనల్ థ్రిల్లర్ కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది.

తమిళ, మలయాళ పరిశ్రమలోకి కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల- నిర్మాత బర్త్ డే స్పెషల్‌గా హైకు ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ, మలయాళ పరిశ్రమలోకి కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల- నిర్మాత బర్త్ డే స్పెషల్‌గా హైకు ఫస్ట్ లుక్ రిలీజ్

హైకు ఫస్ట్ లుక్

నిర్మాత‌ల్లో ఒక‌రైన డాక్ట‌ర్ అరుళ‌నందు పుట్టిన‌రోజు (డిసెంబ‌ర్ 5) సంద‌ర్భంగా హైకు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైకు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. దీంతో హైకు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఇకపోతే హైకు సినిమాను తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. అలాగే, ‘హైకూ’ చిత్రంలో ఏగన్ హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కోర్ట్‌ మూవీ ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల ప్రధాన పాత్ర పోషిస్తంది. కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటిస్తున్న తొలి తమిళ, మలయాళ సినిమా ఇది.

రొమాంటిక్ డ్రామాగా

శ్రీదేవి అపల్లతోపాటు మిన్న‌ల్ ముర‌ళి చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఫెమినా జార్జ్ కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మిస్తే.. ఈ సినిమా రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది.

యువ‌తీ యువ‌కుల్లోని అమాయ‌క‌త్వంతో కూడిన ప్రేమ‌, విద్యార్థి జీవితంలో ఆశ‌లు, వారు క‌నే క‌ల‌ల నేప‌థ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా హైకు రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మ‌న‌కు క‌నిపిస్తున్నారు.

వారి మధ్య చ‌క్క‌టి కెమిస్ట్రీ మ‌న‌కు పోస్టర్‌లో అందంగా క‌నిపిస్తోంది. ఆకాశంలో క‌నిపించే ల‌వ్ సింబ‌ల్ టైటిల్‌ను సూచించే సున్నిత‌మైన భావాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుక‌గా క‌నిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోష‌న‌ల్ జ‌ర్నీని సూచిస్తోంది.

చిన్నసామి దర్శకత్వం

ఇదిలా ఉంటే హైకు సినిమాకు యువ‌రాజ్ చిన్న‌సామి రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆయ‌న యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా యూనిక్ స్టోరీ నెరేష‌న్‌తో ఓ ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చారు. హ‌రిహ‌ర‌న్‌తో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. అదిర్చి అరుణ్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

బేబి, కోర్ట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ బుల్గానిన్ హైకు సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకునేలా, ఎమోష‌న‌ల్ కంటెంట్ క‌నెక్ట్ అయ్యే సంగీతాన్ని ఆయన అందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

జో, కోళి ప‌న్నై చెల్ల దురై చిత్రాల అందించిన విజ‌న్ సినిమా హౌస్ త‌న బ్యాన‌ర్‌లో రూపొందిస్తోన్న మూడో చిత్ర‌మిది. యంగ్ టాలెంట్‌ను, ఆలోచ‌న‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ మ‌రోసారి ఈ నిర్మాణ సంస్థ వైవిధ్య‌మైన సినిమాతో మ‌న ముందుకు రానుంది.

హృదయాన్ని హత్తుకునే ఎలిమెంట్స్

ప్రేమ‌లోని ప‌విత్ర‌త‌, అంద‌మైన స్నేహం, మ‌నల్ని మ‌నం క‌నుగొనే ప్ర‌యాణం వంటి హృద‌యాన్ని హ‌త్తుకునే ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ, స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న డాక్ట‌ర్ అరుళ‌నందుకి చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్‌ను రివీల్ చేయ‌టం ద్వారా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More