బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్- రాణించిన మంచితనం, అదిరిపోయే రెమ్యూనరేషన్- కమెడియన్ 14 వారాల సంపాదన ఇదే!
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు 9 పద్నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) నాటి ఎపిసోడ్‌లోనే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు సుమన్ శెట్టి రెమ్యూనరేషన్ వివరాలు ఆసక్తిగా మారాయి.
బిగ్ బాస్ 9 తెలుగు తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. అయితే, ఈ క్రమంలో టాప్ 5 ఫైనలిస్ట్స్, ప్రతి వారం ఎలిమినేషన్ వంటి వివరాలు ఆసక్తిగా మారాయి.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్
ఈసారి గ్రాండ్ ఫినాలేకు టాప్ 5 లేదా టాప్ 6 కంటెస్టెంట్స్ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ గౌడ, డిమాన్ పవన్, ఇమ్మాన్యూయెల్, కల్యాణ్ పడాల, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి ఏడుగురు ఉన్నారు. వీరిలో నుంచి బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది.
టాప్ 4 కంటెస్టెంట్స్
అయితే, ఈ ఏడుగురిలో అత్యధిక ఓటింగ్‌తో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యూయెల్, డిమాన్ పవన్ టాప్ 4లో ఉన్నారు. వీరి తర్వాత భరణి శంకర్, సంజన, సుమన్ శెట్టి వీరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ, ఈపాటికే బిగ్ బాస్ నుంచి ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ శనివారం (డిసెంబర్ 13) నాడే జరిగింది.
సుమన్ శెట్టి ఎలిమినేట్
అత్యధిక తక్కువ ఓటింగ్‌తో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, హౌజ్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపించని సుమన్ శెట్టి మంచితనం, ఎలాంటి కన్నింగ్ లేకుండా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అలాగే, ఇమ్మాన్యూయెల్ ఎక్కువగా నామినేషన్స్‌లో లేకపోవడంతో అతనికి పడే ఓట్లు సుమన్ శెట్టికి పడినట్లు రివ్యూవర్స్ చెప్పారు.
ఓట్ల రూపంలో అభిమానం
అంతేకాకుండా తెలుగులో తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుమన్ శెట్టి. ఆ అభిమానం కూడా ఓట్ల రూపంలో సేఫ్ చేసిందని మరో వాదన ఉంది. ఇది పక్కన పెడితే 14వ వారంలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి సుమన్ శెట్టి అందుకునే రెమ్యూనరేషన్‌పై అందరి ఆసక్తి నెలకొంది.
రోజుకు 40 వేల పారితోషికం
బిగ్ బాస్ ద్వారా సుమన్ శెట్టికి అదిరిపోయే పారితోషికం అందినట్లు సమాచారం. సుమన్‌కు రోజుకు రూ. 40 వేల రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు టాక్ నడుస్తోంది. అంటే వారానికి రూ. 2 లక్షల 80 వేలుగా సుమన్ శెట్టి పారితోషికం ఉంది. ఈ లెక్కన 14 వారాల్లో సుమన్ శెట్టి బిగ్ బాస్ ద్వారా రూ. 39 లక్షల 20 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది.
సుమన్ శెట్టి 14 వారాల సంపాదన
అయితే, సుమన్ శెట్టి రెమ్యూనరేషన్‌లో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కమెడియన్‌కు రోజుకు రూ. 45 వేల పారితోషికం ఇచ్చినట్లు దాంతో వారానికి రూ. 3 లక్షల 15 వేలు అందుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే గనుక బిగ్ బాస్ తెలుగు 9 ద్వారా కమెడియన్ సుమన్ శెట్టి 14 వారాల్లో సుమారుగా రూ. 44 లక్షల 10 వేలు సంపాదించినట్లుగా చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


