మంచోడా? చెడ్డోడా? అనేది సరిగ్గా అర్థం కాదు, కోర్ట్ కంటే ముందే అడ్వాన్స్ ఇచ్చారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

బిగ్ బాస్‌తో మరోసారి క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరో, నటుడు శివాజీ. ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్న శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన దండోరా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు శివాజీ.

Published on: Dec 18, 2025, 09:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ హీరోగా సూపర్ క్రేజ్ సాధించిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్ బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు 7తో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించి వరుస సినిమా ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు. కోర్ట్ మూవీలో మంగపతిగా అలరించిన శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా.

మంచోడా? చెడ్డోడా? అనేది సరిగ్గా అర్థం కాదు, కోర్ట్ కంటే ముందే అడ్వాన్స్ ఇచ్చారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్
మంచోడా? చెడ్డోడా? అనేది సరిగ్గా అర్థం కాదు, కోర్ట్ కంటే ముందే అడ్వాన్స్ ఇచ్చారు.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

సామాజిక అసమానతలపై

సామాజిక అసమానతలపై తెరకెక్కిన దండోరా సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. శివాజీతోపాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన దండోరా డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

శివాజీ కామెంట్స్

ఈ నేపథ్యంలో దండోరా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దండోరా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు శివాజీ.

‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నారా?

-ముందుగా ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కోర్ట్ కంటే ముందే ‘దండోరా’ మేకర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, ప్రొడక్షన్ పరంగా ఆలస్యమైంది. అలా ‘కోర్ట్’ ముందుగా రిలీజ్ అయింది.

‘దండోరా’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

-‘దండోరా’ చిత్రంలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది.

-ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది.

‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం అనుకోవచ్చా?

-‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ‘దండోరా’ మాత్రం అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది.

‘కోర్ట్’ తరువాత వస్తున్న ‘దండోరా’పై సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి వాటికి తగ్గట్టుగానే మీ పాత్ర ఉంటుందా?

-‘కోర్ట్‌’ మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్‌తో ఎమోషనల్‌గా సాగే చిత్రమిది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More