నా మెదడులో చాలా కథలున్నాయి, నాకు ఎదురైన అనుభవంతోనే ఈ కథ రాశా, మలయాళంలోనే ఇలాంటివి ఎక్కువ వస్తాయంటారు: దండోరా దర్శకుడు
రూరల్ బ్యాక్‌డ్రాప్ సోషల్ సెటైరికల్ సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ, నందు, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా ఇవాళ దండోరా సినీ విశేషాలను తెలిపారు డైరెక్టర్ మురళీకాంత్.
సమాజంలోని సామాజిక అసమానతలపై సోషల్ సెటైరికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

దండోరా దర్శకుడి కామెంట్స్
డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా దండోరా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 15) మీడియా ఇంటర్వ్యూలో దండోరా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు డైరెక్టర్ మురళీకాంత్.
‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది?
-మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ, నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను అక్కడ కూడా ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాల మీద ఇష్టంతో జీవితంలో రిస్క్ తీసుకుని ఇటు వైపు వచ్చాను.
-నా మెదడులో చాలా కథలు ఉన్నాయి. అయితే ప్రేమ కథల్ని నెరేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఓ కాన్సెప్ట్, మూలాల్లోని కథ చెప్పాలని ఈ స్టోరీ అనుకున్నాను. పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో మంది, ఎన్నో రకాల లైఫ్ స్టైల్స్ తెలుస్తాయి. సమాజంలోని అసమానతల మీద కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘దండోరా’ తీశాను.
‘దండోరా’ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
-చనిపోయిన వ్యక్తుల్ని పూడ్చేందుకు కమ్యూనిటీ వైజ్‌గా, రిలీజియస్ వైజ్‌గా కొంత మందికి భూమిని కేటాయిస్తారని నాకు అంతగా తెలీదు. నాకు ఎదురైన ఓ అనుభవంతో ఈ కథను రాసుకున్నాను. మలయాళంలో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తాయని అంటుంటారు. మన దగ్గర ఎందుకు రావు? అనే ఆలోచనల్లోంచి ఈ కథను రాసుకున్నాను.
‘బలగం’ కూడా చనిపోయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’తో పోలికలు ఏమైనా వస్తాయా?
-‘బలగం’లో వ్యక్తి చనిపోయిన తరువాత జరిగే పిండ ప్రధానం చుట్టూ తిరుగుతుంది. ‘దండోరా’ చిత్రంలో వ్యక్తి చనిపోయిన తరువాత నుంచి పూడ్చి పెట్టే వరకు జరుగుతుంది. క్రిమేషన్‌తో ఈ చిత్రం ఎండ్ కార్డ్ పడుతుంది.
-‘బలగం’ కథకి, ‘దండోరా’కి ఎలాంటి పోలికలు, స్పూర్తి గానీ లేదు. ఓ వ్యక్తిని ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అన్నదే కథ.
వైకుంఠధామాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా? ఈ చిత్రంలో ఆ పాయింట్ టచ్ చేశారా?
-ప్రభుత్వాలు వైకుంఠ ధామాల్ని ఏర్పాటు చేసింది. కానీ, అక్కడ కూడా వివక్షనే చూపిస్తుంటారు. నేను ప్రత్యక్షంగా ఎన్నో ఘటనల్ని చూశాను. అందుకే ఈ కథను రాసుకున్నాను. అయితే ఈ సమస్యకు నేను పూర్తిగా పరిష్కారాన్ని ఇచ్చానా? చూపించానా? అన్నది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్పాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


