ముద్దు కావాలన్నావ్, ముద్దు సీన్ చూడకుండా వచ్చేసినవ్- చావు పుట్టుకల మధ్య సంఘర్షణతో దండోరా టీజర్- అదిరిపోయిన డైలాగ్స్
బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా దండోరా. చావు పుట్టుకల మధ్య జరిగే సంఘర్షణతో, రొమాంటిక్ లవ్ ట్రాక్‌తో తెరకెక్కిన దండోరా టీజర్ ఇవాళ (నవంబర్ 17) విడుదలైంది. అదిరిపోయే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్‌తో దండోరా టీజర్ ఆకట్టుకుంటోంది.
బిగ్ బాస్ శివాజీ, హీరో నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, మౌనిక రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం దండోరా.

దండోరా టీజర్ రిలీజ్
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సినిమా ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీనే ‘దండోరా’.
ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న దండోరా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ సోమవారం (నవంబర్ 17) దండోరా మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అదిరిపోయే డైలాగ్స్‌తో ఆద్యంతం దండోరా టీజర్ ఆకట్టుకుంది.
లోతైన సంభాషణలతో
ఓవైపు రొమాంటిక్ లవ్ స్టోరీ చూపిస్తూనే మరోవైపు చావు పుట్టుకల మధ్య సాగే సంఘర్షణను ఎమోషనల్‌గా, లోతైన సంభాషణలతో బాగా చూపించారు. వాటికి సరిపోయేలా బీజీఎమ్, సినిమాటోగ్రఫీ మెప్పించేలా ఉంది.
దండోరా టీజర్‌ను గమనిస్తే.. ప్రేమికుడు ప్రేయసితో మాట్లాడుతూ ఆమెను ముద్దు పెట్టుకుంటానని అంటాడు. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్.. పిచ్చిపిచ్చిగా ఉందా’ అంటూ ఆ అమ్మాయి రివర్స్ అయ్యే సీన్ కామెడీగా ఉంటుంది. అలా మొదలైన టీజర్‌లో నెక్ట్స్ రెండు పాత్రలను పరిచయం చేశాడు.
నవదీప్-శివాజీ పాత్రలు
ఓ పాత్ర సర్పంచ్.. ఈ పాత్రలో నవదీప్ నటించాడు. కూలింగ్ గ్లాసెస్ వేసుకుని అందరూ నమస్కారం పెడుతుంటే తను కూడా వారికి విష్ చేస్తూ దర్పంగా ఉండే పాత్రలో నవదీప్ కనిపించాడు. తర్వాత మరో పాత్రను పరిచయం చేశారు.. అందులో నటుడు శివాజీ కనిపించారు.
‘హైదరాబాద్ పో..అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఈడీకే తేవాలే’ అని శివాజీ చెబుతుంటాడు. ‘మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది’ అని వెటకారంగా నవదీప్ చెప్పే డైలాగ్.. పల్లెటూర్లు కొన్ని సీన్స్ కామెడీ టచ్‌తో సాగేలా ఉన్నాయి.
చావుకు తెల్ల డ్రెస్ వేసుకోవాలని
మరో కొత్త పాత్ర ఎంట్రీ.. నందు. ‘చావుకు తెల్ల డ్రెస్సులు వేసుకోవాలని ఏడ నేర్చుకున్నరే, మళ్లా మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మ కూతుళ్లు’ అని మౌనికతో నందు చెప్పేది కామెడీగా ఉన్నా ఆలోచించేలా ఉంది. రవికృష్ణ లవ్ ట్రాక్ చూపించారు. "ముద్దు ముద్దు అంటావ్, ముద్దు సీన్ చూడకుండానే వచ్చేసినవ్" అని రవికృష్ణతో హీరోయన్ చెప్పడం హైలెట్‌గా ఉంది.
అలాగే బిందు మాధవి.. వేశ్య పాత్రలో కనిపించింది. ‘ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు డబ్బులిస్తున్నారు..నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నానంటూ’ ఆమె శివాజీతో చెప్పిన డైలాగ్ సీన్స్‌తో పాత్రలను పరిచయం చేశారు దర్శకుడు.
ఎమోషనల్ యాంగిల్
ఆ తర్వాత ఓ ఎమోషనల్ కోణాన్ని ఆవిష్కరించారు. శవాన్ని మోస్తూ తీసుకెళుతుంటారు. అక్కడ ఓ పిల్లాడు అన్నా.. మా అవ్వను ఇంత దూరం ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తాడు.
‘నాలుగు పుస్తకాలు చదివి.. లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా’ అంటూ శివాజీ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో మరేదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందని తెలుస్తోంది. పుట్టుక.. చావు మధ్య మనిషి ఎదుర్కొనే సంఘర్షణ, పరిస్థితులు, భావోద్వేగాలు గురించి చెప్పే కథాంశంతో ‘దండోరా’ రూపొందుతోందని స్పష్టమవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


