సెన్సిటివ్ సబ్జెక్ట్‌తో సినిమా చేస్తే కాంట్రవర్సీ అయ్యే సమస్య ఉంది కదా.. దండోరా డైరెక్టర్ మురళీకాంత్ ఆన్సర్ ఇదే!
బిగ్ బాస్ శివాజీ, నందు, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా దండోరా. ఈ సినిమాకు డైరెక్టర్ మురళీకాంత్ దర్శకత్వం వహించారు. సమాజంలోని సామాజిక అసమానతలపై తెరకెక్కిన ఈ సినిమా నుంచ దండోరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో మీడియా ప్రశ్నలకు దర్శకుడు సమాధానాలు ఇచ్చారు.
బిగ్ బాస్ శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.

మీడియా ప్రశ్నలు
సమాజంలోని సామాజిక అసమానతలపై తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇటీవల దండోరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దండోరా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించగా డైరెక్టర్ మురళీకాంత్ సమాధానాలు ఇచ్చారు.
దండోరా వంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌తో సినిమా చేస్తే కాంట్రవర్సీ అయ్యే సమస్య ఉంది కదా!
దర్శకుడు మురళీకాంత్: కాంట్రవర్సీ ఏం కాదండి. ఎందుకంటే సినిమా కంటూ కొన్ని హద్దులుంటాయి. వాటికి లోబడే మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. సమాజంలో దీని వల్ల మార్పు వస్తుందనేంత గొప్ప మాటలు చెప్పలేను. మనకు జీవితంలో ఎదురయ్యే అనుభవాలే ఈ సినిమా. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది.
ఈ సినిమా కమర్షియల్ ఫార్మేట్‌లో ఉంటుందని అంటున్నారు. కమర్షియల్ మూవీ అంటే టేకింగ్‌లో ఎక్కడైనా పక్క దారి పట్టే అవకాశ ఉంటుంది కదా?
డైరెక్టర్ మురళీకాంత్: దండోరాను కమర్షియల్‌గా తెరకెక్కించినప్పటికీ ఎక్కడా పక్క దారి పట్టలేదు. మేం మొదటి రోజు నుంచి చాలా క్లారిటీతో ఉన్నాం. ఏ ఎమోషన్ అయితే చూపించాలని అనుకున్నానో, దాన్ని అలాగే, అంతకు మించే చేశామనిపిస్తోంది.
డెబ్యూ మూవీని దండోరా వంటి హర్డ్ హిట్ సబ్జెక్ట్‌నే ఎందుకు చేయాలనిపించింది?
దర్శకుడ మురళీకాంత్: ఈ సినిమాను రాసేటప్పుడే నేను ఎంజాయ్ చేస్తూ రాశాను. కాన్ఫిడెంట్‌గానే ప్రిపేర్ చేశాను. కథను వంద మందికి కూడా చెప్పాల్సి రావచ్చు. మొదటి వ్యక్తికి చెప్పేటప్పుడు ఎంత ఎగ్జయిటెడ్‌గా ఉంటానో, వందో వ్యక్తికి చెప్పేటప్పుడు కూడా అంతే ఎగ్జయిటెడ్‌గా ఉండాలి. అయితే నాకు ఎక్కువ సమయం పట్టలేదు. బెన్నీగారు కథ విని ఓకే చేశారు. శివాజీ అన్న ఓకే చెప్పడం అన్నీ చకచకా జరిగాయి.
దండోరా టైటిల్ సాంగ్ చేసే సమయంలో మీ ఎక్స్‌పీరియెన్స్ ఏంటి?
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె.రాబిన్ : నేను రాత్రి సమయాల్లోనే మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటాను. మురళీకాంత్ గారు రాత్రి వచ్చే సాంగ్స్ గురించి డిస్కషన్ చేసేవాడు. కాసర్ల శ్యామ్ రాసిని లిరిక్స్ చూసి షాకయ్యాం. ఆంథోని కూడా అద్భుతంగా పాడాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


