ఓటీటీలోకి తమిళ కాంట్రవర్సీ మూవీ.. వెట్రిమారన్ ప్రొడ్యూసర్.. రెండు అవార్డులు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
టీజర్ తోనే పెద్ద వివాదానికి కారణమై, చాలా కట్ ల తర్వాత థియేటర్లో రిలీజైన తమిళ సినిమా ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం.
ఓటీటీలోకి ఓ తమిళ కాంట్రవర్సీ మూవీ రాబోతోంది. టీజర్ తోనే వివాదాన్ని రేపిన ‘బ్యాడ్ గర్ల్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామైంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదం కలకలం రేపింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

బ్యాడ్ గర్ల్ ఓటీటీ
తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా ‘బ్యాడ్ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వెట్రిమారన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 4 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు. ఈ చిత్రానికి వెట్రిమారన్ శిష్యురాలు వర్ష భరత్ డైరెక్టర్. ఆమెకు దర్శకురాలిగా ఇదే ఫస్ట్ సినిమా.
రెండు అవార్డులు
బ్యాడ్ గర్ల్ మూవీకి రెండు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇందులో అంజలి శివరామన్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఆమెకు డైరెక్టర్ వర్ష డబ్బింగ్ చెప్పడం విశేషం. బ్యాడ్ గర్ల్ సినిమాలో శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ తదితరులు నటించారు.
కథ ఏమిటంటే?
ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). ఆమె హై స్కూల్ డేస్ నుంచి కాలేజీ, ఆ తర్వాత లైఫ్ లోనూ సరైన పార్ట్ నర్ ను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ సామాజిక అడ్డుగోడలు, స్ట్రిక్ట్ పేరేంట్స్ అడ్డుగా నిలుస్తారు. ఈ ప్రయాణంలో రమ్యకు నిజమైన ప్రేమ కూడా దొరకదు. మరి చివరకు రమ్య ఏం చేసింది? ఆమె జర్నీ ఎక్కడి వరకూ వెళ్లిందన్నది సినిమాలో చూడాల్సిందే.
బ్యాడ్ గర్ల్ వివాదం
బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ ను 2025, జనవరి 26న రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. చిన్న వయసులోనే మద్యానికి బానిస కావడం, ఒక సామాజిక వర్గాన్ని తప్పుగా చూపించడం లాంటి ఆరోపణలతో మూవీ కాంట్రవర్సీకి దారి తీసింది.
వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ తో పాటు పా.రంజిత్, విజయ్ సేతుపతిని లక్ష్యంగా చేసుకుని పర్సనల్ అటాక్స్ కూడా జరిగాయి. ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లకు కత్తెర వేయడంతో ఈ మూవీ రిలీజైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


